UP: యూపీలో దారుణం.. కదులుతున్న కారులో యువతిపై అత్యాచారం..
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై నేరాలు ఆగడం లేదు. తాజాగా కదులుతున్న కారులో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ జైసింగ్‌పూర్ ఏరియా సుల్తానాపూర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు.

ఇంజినీరింగ్
23 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఆమె రోడ్డు వేచి ఉంది. అయితే సెలవుల సీజన్ కావడంతో బస్సులు, ఆటోలు రాలేదు. చాలా సేపు నిరీక్షించిన తర్వాత ఆమె ఓ ప్రైవేట్‌వాహనాన్ని ఆపి లిఫ్ట్ అడిగింది.
ప్రతిఘటించే లోపే
కారు ఆపిన వారు ఆమెను ఎక్కించుకున్నారు. అయితే డ్రైవర్ సీట్‌లో ఉన్న వ్యక్తి వెనకాలకు వచ్చాడు. ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి కారును నడిపాడు. యువతి వారిని ప్రతిఘటించే లోపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. ఆ తర్వాత ఆమెను ఆమెను దగ్గర్లో ఉన్న కాలువ వద్ద పడేసి పారిపోయారు.

నిందితుల కోసం గాలింపు
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్దారించుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications