బెంగళూరు కంపెనీలో సెలవు ఇవ్వలేదని అనంతపురం యువకుడు ఏం చేశాడంటే ?, పిన్ టూ పిన్ !
ఫ్యాక్టరీలో సెలవు ఇవ్వలేదని ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బెంగళూరు నగరంలోని బాగల్‌గుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. టి.దాసరహళ్లిలో నివాసం ఉంటున్న గోవిందరాజు అలియాస్ గోవింద్ (24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని శనివారం బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో టి దాసరహళ్లిలోని ఆర్పీఎం అపార్ట్‌మెంట్‌లో గోవిందరాజు ఆత్మహత్య చేసుకున్నాడని, అయితే రాత్రి ఆలస్యంగా తమకు సమాచారం అందిందని పోలీసులు అంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మడకశిరకు చెందిన గోవిందరాజు గత ఆరేళ్లుగా బెంగళూరులోని పీణ్యాలోని కేఆర్‌డీఆర్ వాచ్ లు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న గోవిందరాజు దాసరహళ్లిలోని ఎర్పీఎం అపార్ట్‌మెంట్ లో మైంటెన్స్ పనులు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. రాత్రి పూట గోవిందరాజు ఇదే అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కేఆర్‌డీఆర్ వాచ్ లు తయారు చేసే కంపెనీలో పని చేస్తున్న మేనేజర్, సూపర్‌వైజర్‌ను తనకు సెలవు మంజూరు చెయ్యాలని, ఊరికి వెళ్లి వస్తానని గోవిందరాజ్ మనవి చేశాడని తెలిసింది.
అయితే సెలవు ఇవ్వలేమని మేనేజర్, సూపర్ వైజర్ గోవిందరాజుకు చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇద్దరూ గోవిందరాజును బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోవిందరాజు విసుగు చెందినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.గురువారం ఫ్యాక్టరీలో పనికి వెళ్లకుండా అపార్ట్‌మెంట్‌లోనే గోవింరాజు ఉండిపోయాడు. సాయంత్రం తరువాత చీరతో మెట్ల రెయిలింగ్‌కు ఉరేసుకున్న గోవింరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గోవిందరాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో డెత్ నోట్ దొరికిందని పోలీసులు అన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ , సూపర్ వైజర్ తనకు సెలవు ఇవ్వకుండా వేధిస్తున్నారని, సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని, దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గోవిందరాజు డెత్ నోట్ రాశాడని పోలీసులు తెలిపారు. బాగలగుంటె పోలీస్ స్టేషన్‌లో ఫ్యాక్టరీ మేనేజర్, సూపర్‌వైజర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications