వీటికి ఆధార్ కార్డు ఎందుకూ పనికి రాదు.. !!
ఆధార్ కార్డు లేకపోతే ఏ పనీ జరగదు. బ్యాంక్ అకౌంట్లు మొదలుకుని ట్రైన్ టికెట్ల బుకింగ్ వరకూ ఆధార్ కార్డు కావాల్సిందే. సంక్షేమ పథకాల లబ్దిని పొందడానికి, ఉచిత బస్సుల్లో మహిళలు ప్రయాణం సాగించడానికీ ఆధార్ కార్డే ప్రధానం. ఆధార్ కార్డు చూపిస్తేనే చాలా చోట్ల ప్రవేశం లభిస్తుంది. హోటళ్లల్లో గదులు బుక్ చేసుకోవడానికీ ఆధార్ కార్డు తప్పనిసరి.
ఈ పరిణామాల మధ్య రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తాజా నిర్ణయాలను తీసుకున్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా జారీ అయిన అన్ని జనన ధృవీకరణ పత్రాలను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దు చేస్తామని మహారాష్ట్ర ప్రకటించింది. హోం, రెవెన్యూ శాఖల అదనపు ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావంకులే తెలియజేశారు. ఆధార్ కార్డు ఆధారంగా నకిలీ జనన ధృవీకరణ పత్రాలు ఎక్కువగా జారీ అవుతున్నాయని, దీన్ని అరికట్టడానికి తాజా నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలోని అమరావతి, అకోలా, లాతూర్, శంభాజీనగర్ వంటి 14 జిల్లాల్లో ఆధార్ కార్డ్ ఆధారంగా నకిలీ జనన ధృవీకరణ పత్రాలు భారీగా జారీ అయినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఆధార్ కార్డును పుట్టిన తేదీ, పుట్టిన స్థలానికి ఏకైక రుజువుగా అంగీకరించలేమని చంద్రశేఖర్ బావంకులే స్పష్టం చేశారు.
పుట్టిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు జనన ధృవీకరణ పత్రాలను ఆరోగ్య శాఖ జారీ చేస్తుంది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ ఈ పత్రాలను జారీ చేస్తుంది. 14 జిల్లాల్లో ఆధార్ కార్డ్ ఆధారంగా బర్త్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నట్లు ప్రభుత్వం తాజాగా గుర్తించింది. జనన ధృవీకరణ పత్రాల జారీపై అన్ని తహసీల్దార్లు, సబ్ డివిజనల్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్లకు 16 పాయింట్ల మార్గదర్శకాలను జారీ చేసింది. 2023, ఆగస్టు తర్వాత నాయబ్ తహసీల్దార్లు జారీ చేసిన అన్ని జనన/రిజిస్ట్రేషన్ ఆదేశాలు రద్దు చేసింది.
దరఖాస్తు, ఆధార్ కార్డు వివరాల మధ్య వ్యత్యాసం ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేస్తారు. నకిలీ జనన ధృవీకరణ పత్రాలను తిరిగి ఇవ్వడంలో విఫలమైన వారిని లేదా గుర్తించలేని వారిని పరారీలో ఉన్నట్లు ప్రకటిస్తారు. వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ 14 జిల్లాల్లో కూడా ప్రత్యేక ధృవీకరణ శిబిరాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చింది. పుట్టిన తేదీని ధృవీకరించడానికి లేదా జనన ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డును ఇకపై పరిగణించబోమని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని శాఖలకు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డుకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం జతచేయరు. ఆధార్ కార్డును జనన ధృవీకరణ పత్రంగా ఆమోదించడం కుదరదని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఈ మేరకు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఉత్తర్వులు ఇచ్చారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications