"పికెకు అమీర్ పాక్ ఐఎస్ఐ సాయం తీసుకున్నాడు"
న్యూఢిల్లీ: పీకే సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సాయం తీసుకున్నారని బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈ ఆరోపణలపై అమీర్ ఖాన్ ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదని స్వామి అన్నారు.
భారత్ గొప్పతనం గురించి ఆటో డ్రైవర్‌తోనే కాదు భార్యతో కూడా చెప్పాలన్న బిజెపి నేత రాం మాధవ్ వ్యాఖ్యలను కూడా స్వామి సమర్థించారు. భారత్ గొప్పతనం గురించి ఓ పక్క ప్రకటనల్లో సమర్థిస్తూనే మరోపక్క భారత్ వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పడం సరి కాదని స్వామి అన్నారు.

భార్యకు అంత ఆందోళనగా ఉంటే ఆమె భారత్ వదిలిపోవచ్చని స్వామి చెప్పారు. అమీర్ ఖాన్‌పై బిజెపి నేతల దాడి కొనసాగుతూనే ఉందనడానికి స్వామి తాజా ప్రకటన నిదర్శనంగా నిలుస్తుంది.
భారత్ వదిలిపెట్టి పోదామా అంటూ తన భార్య కిరణ్ అడిగిందని అమీర్ ఖాన్ అసహనంపై మాట్లాడుతూ అన్నప్పటి నుంచి వివాదం చెలరేగుతూనే ఉంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ దంగల్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications