ఢిల్లీలో ఎఎపి ఫస్ట్.. కేజ్రీవాల్ సెకండ్!: మోడీదే హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ గద్దెను ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) దేశ రాజధానిలో దాదాపు లోకసభ సీట్లను అన్నింటిని కైవసం చేసుకోనుందట. ఢిల్లీ - నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని ఏడు లోక్‌సభ సీట్లకుగాను ఆరింట పాగా వేయనుందట.ఎబిపి న్యూస్ కోసం ఎసి నీల్సన్ సంస్థ చేసిన సర్వేలో ఇది తేలింది.
ఇందులో భాగంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, గ్రేటర్ ముంబై ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతాల్లోని మొత్తం 21 సీట్లకుగాను యూపిఏ గతంలో 17 సీట్లు గెలుచుకుంది. కానీ, 2014 ఎన్నికల్లో వీటిలో కేవలం మూడింటిలో మాత్రమే గెలుబోతుందట.

మిగతా 18 సీట్లలో ఎనిమిది ఎఎపికి, పది భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటాయని సర్వేలో తేలింది. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటుపై ఆశలు పెట్టుకున్న బిజెపికి ఈ సర్వే ఫలితాలు ఆందోళన కలిగించేవే అంటున్నారు.
మరోవైపు ప్రధాని అభ్యర్థిగా మెజారిటీ ఓటు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకే పడింది. ప్రధాని అభ్యర్థిగా మోడీకి ఢిల్లీలో 45% ఓట్లు పడితే, కేజ్రీవాల్‌కు 42% ఓట్లు వచ్చాయి. మోడీ మొదటి స్థానంలో ఉండగా, కేజ్రీవాల్ రెండో స్థానంలో ఉన్నారు.
ముంబై - థానేల్లో మాత్రం మోడీ (51%) కేజ్రీవాల్‌కు అందనంత (18%) దూరంలో ఉన్నారు. పైగా ఇక్కడ 22% ఓట్లతో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. ఎసి నీల్సన్ సంస్థ 21 నియోజకవర్గాల్లో ఒక్కో స్థానంలో 3 అసెంబ్లీ సీట్లలో 2585 మందిని ప్రశ్నించి ఈ సర్వే చేసింది.












Click it and Unblock the Notifications