ప్రధాని మోదీ చనిపోయాడు: దుమారం రేపుతున్న కామెంట్స్..!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జైలు నుంచి త్వరగా విడుదల కావాలని ప్రార్థిస్తున్నానంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై సీబీఐ విచారణ మరింత ముమ్మరమైంది. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ అధికారులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తోన్నారు. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. మరికొన్ని అరెస్టులు కూడా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

సీబీఐ విచారణలో డిప్యూటీ సీఎం..
తాజాగా- ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ఇదివరకే ఆయనను విచారించారు కూడా. ఇవ్వాళ మరోసారి మనీష్ సిసోడియాను విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీ కార్యకర్తలతో..
ఈ క్రమంలో ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణకు బయలుదేరి వెళ్లడానికి ముందు మనీష్ సిసోడియా నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు. మనీష్ సిసోడియాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీజేపీ, సీబీఐకి వ్యతిరేకంగా నినదించారు.

సంజయ్ సింగ్ అరెస్ట్..
మనీష్ సిసోడియాను విచారిస్తోన్న సీబీఐ కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సంజయ్ సింగ్ దీనికి సారథ్యాన్ని వహించారు. ఆయనతో పాటు వందల మంది కార్యకర్తలు సీబీఐ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిరసన దీక్షకు దిగారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు.
మోదీ చనిపోయాడంటూ..
కాగా- మనీష్ సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోదీ మర్ గయా (మోదీ చనిపోయాడు), అదాని కా నౌకర్ (అదాని వద్ద ఉద్యోగి) అంటూ వారు నినాదాలు చేశారు. మనీష్ సిసోడియాకు జిందాబాద్ కొట్టారు. ఈ వ్యాఖ్యలు చేసిన వారందరూ ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలే.

బీజేపీ ఫైర్..
ఆప్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతీయ జనత పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దీనికి ప్రతిగా ఘాటు విమర్శలు చేస్తోన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిందని, దీని ఫలితం ఎలా ఉందో అందరికి తెలిసిందేనని అన్నారు. ఇప్పుడు ఆప్ కు కూడా అదే గతి పడుతుందంటూ బీజేపీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్రా హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.












Click it and Unblock the Notifications