హస్తానికి ఓటేస్తే.. కమలానికి వేసినట్టే: గోవాలో దూకుడు పెంచిన కేజ్రీవాల్
గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు వ్యహాత్మకంగా అడుగులు వేస్తోంది. గోవాలో అధికారం కైవసం చేసుకునేందుకు ఆమ్ఆద్మీ పార్టీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా వినూత్న రాజకీయాలకు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెరతీశారు. తమ పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేందుకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచినా, ఓడినా పార్టీని వీడబోరంటూ ఓటర్లకు హామీ ఇస్తూ జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.

ప్రమాణ పత్రాలపై ఆప్ అభ్యర్థులు సంతకాలు
గోవా ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకం కలిగించేలా.. తమ పార్టీ అభ్యర్థులతో ప్రమాణ పత్రాలపై ఆపార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంతకం చేయించారు .. వాటిని ఓటర్లకు పంచే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పనాజీలో ఆప్ అదినేత కేజ్రీవాల్ పనాజీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన బీజేపీ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. బీజేపీని గోవా నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

గోవా నుంచి బీజేపీని తరిమేయాలి
గోవాలో అనినీతి లేని, నిజాయితీ గత పాలన కావాలంటే ఆప్ కు ఓటేయ్యాలని ప్రజలను కేజ్రీవాల్ కోరారు. గోవా ప్రజల ముందు రెండు అవకాశాలు ఉంచారు. ఒకటి ఆప్ కు ఓటేయడం.. రెండవది బీజేపీకి ఓటేయడం అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ తరికొట్టాలంటే ఆప్ ను గెలపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరోక్షంగా కమలానికి ఓటేసినట్లేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు గెలిస్తే ఎన్నికల అనంతరమే బీజేపీలో చేరిపోతారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే..
2017 గోవా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అతి పెద్దపార్టీగా అవతరించింది.. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 17 గెలించింది. కానీ, కేవలం 13 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ గలిగింది. కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎంజీబీ, జీఎఫ్పీ మద్దతు ఒక కారణమైతే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం మరొక కారణం.
నాడు అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీకి నేడు ఇద్దరు ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. దానిని దృష్టిలో ఉంచుకోని ఆప్ అధినేత కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications