నిర్మలాస్త్రం పని చేసినట్టే- తొలి వికెట్ పడ్డట్టే
Exit Polls 2025 on Delhi: దేశ రాజధానిలో ఇక భారతీయ జనతా పార్టీ పాగా వేసినట్టే కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ముకుమ్మడిగా బీజేపీకి జిందాబాద్ కొట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలకు తెర పడినట్టేనంటూ అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి.
ఈ దఫా ఈ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. బీజేపీ అబ్జల్యూట్ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. సగటును 35 నుంచి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. ఇవి- ఎంత వరకు వాస్తవరూపాన్ని దాల్చుతాయనేది ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోతుంది.
కాగా ఆప్ ఓటమికి కారణాలేమై ఉండొచ్చనే అంచనాలు సైతం వెలువడుతున్నాయి. ఇందులో- ప్రధానంగా పన్ను మినహాయింపు బీజేపీకి ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. ఢిల్లీలో నివసించే వారిలో అత్యధికులు ఉద్యోగులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారక్కడ.
కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును ఇవ్వడం బీజేపీ గెలవడానికి ప్రధానంగా బాటలు వేస్తుందని అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఆర్థికంగా లబ్ది పొందగలుగుతారు. ఆ కృతజ్ఞతను ఓటు రూపంలో బీజేపీకి తెలియజేసి ఉండొచ్చని చెబుతున్నారు.
అదే సమయంలో - ఢిల్లీ వాతావరణం విషపూరితం కావడం మరో కారణం అనే అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ దిగజారిపోతోండటం, యమునా నది మొత్తం కాలుష్యమయం అయిందనేది జగమెరిగిన సత్యం. దీన్ని బీజేపీ తన ప్రచారానికి వాడుకుంది. సక్సెస్ సాధించినట్టే కనిపిస్తోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications