గోవా ప్రజలపై కేజ్రీ హామీల జల్లు - రూ.3 వేలు నిరుద్యోగ భృతి : 13 పాయింట్ల అజెండా..!!
దేశ వ్యాప్తంగా మినీ సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలు పోడీ పడి హామీలిస్తున్నాయి. గోవాలో ఈ సారి గట్టి పోటీ ఇస్తున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ గోవా ఓటర్లకు హామీలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో అధికారంలోకి వస్తే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన ప్రకటించారు. గోవాలో ఓటర్లను ఆకట్టుకొనేందుకు 13 పాయింట్ ఫార్ములా ప్రకటించారు. అందులో వరుసగా.. ఉద్యోగ కల్పన.. మైనింగ్ ప్రారంభం.. భూ హక్కుల పునరుద్దరణ..ఉన్నత విద్య..ఉత్తమ ఆరోగ్య మౌళిక వసులు..అవినీతి లేని ప్రభుత్వం.. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతీ మహిళకు రూ వెయ్యి రూపాయాలు ఇస్తామన్నారు.
వ్యవసాయంలో ఉత్తమ విధానం.. ట్రేడ్..ఇండస్ట్రీలో సులభర విధానాలు..టూరిజం డెవలప్ మెంట్.. 24 గంటల ఉచిత విద్యుత్.. 24 గంటల ఉచిత మంచి నీరు..మంచి రోడ్లు అందిస్తామని కేజ్రీ ప్రకటించారు. ప్రతి గ్రామంలో మొహల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన గోవాలో పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో అభ్యర్థుల తరుపున పర్యటించారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా గోవా యువతకు క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే కేజ్రీవాల్ తన తొలి జాబితాను ప్రకటించారు. ఆరు నెలల కాలంగా గోవాలో ఎన్నికల కార్యాచరణను కేజ్రీవాల్ అమలు చేస్తున్నారు.

పంజాబ్..గోవా రాష్ట్రాల ఎన్నికల్లో ఈ సారి ఆప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. కేజ్రీవాల్ సైతం ఈ రెండు రాష్ట్రాల్లో అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు చేస్తున్నారు. పంజాబ్ లో ఎస్సెమ్మెస్ విధానం ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్ది ఎవరనేది నిర్ణయిస్తామని కేజ్రీ ప్రకటించారు. ఇక, గోవాలో టీఎంసీ సైతం పోటీకి దిగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందుగానే అక్కడి కీలక నేతలకు టీఎంసీ కండువా కప్పారు. టీఎంసీ అధినేత్రి మమతా సైతం ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఓటమి లక్ష్యంగా తాము ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పని చేస్తామని ప్రకటించారు. 2017 లో జరిగిన ఎన్నికలు..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఇక, ఈ సారి ఎన్నికలు మాత్రం అన్ని ప్రధాన పార్టీలకు సవాల్ గా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications