వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షీలా దీక్షిత్ ఎఫెక్ట్: రాహుల్ గాంధీపై కేజ్రీవాల్ పార్టీ పోటీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పదిహేనేళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేసిన షీలా దీక్షిత్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓడించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో కాంగ్రెసు పార్టీ అగ్రనేతల పైన పోటీ చేసేందుకు ఆ పార్టీ ఉత్సాహం చూపుతోంది.

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన పోటీకి ఎఎపి సై అంటోంది. తమ పార్టీకి చెందిన నేత కుమార్ విశ్వాస్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధీ పైన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాహుల్‌తో పాటు ఆయా పార్టీల అగ్రనేతల పైన తమ అభ్యర్థులను పోటీకి దింపేందుకు కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు.

AAP leader Kumar Vishwas may challenge Rahul in Lok Sabha poll

అగ్రనాయకుల పైన తమ పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు వెనుకాడబోమని ఎఎపి నాయకులు మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. ఢిల్లీలో ఎఎపి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా సిసోడియా పై వ్యాఖ్యలు చేశారు.

ఎఎపి ముంబైతో పాటు పలు ప్రాంతాల పైన దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. అవినీతిని వ్యతిరేకించే కాంగ్రెసు, బిజెపిలలో ఉన్న నేతలు తమ పార్టీలో చేరవచ్చునని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి విరాళాలు ఇవ్వాలని కోరారు.

English summary
After making an impressive debut in capital, AAP on Wednesday said it will contest Lok Sabha election with hints thrown that one of its leaders Kumar Vishwas may contest against Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X