ఆప్ ఎమ్మెల్యేపై దాడి, వీడియో వైరల్, ఎందుకంటే.?
ఢిల్లీ మున్సిపోల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. అయితే అధికార ఆప్‌కు ఇబ్బంది కలిగించే ఓ ఘటన జరిగింది. ఏకంగా ఎమ్మెల్యేపై దాడి జరిగింది. ఆ తర్వాత సదరు ఎమ్మెల్యే పరుగు తీసినట్టు తెలిసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై ఆప్ రియాక్ట్ కాలేదు.

మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ రాత్రి 8 గంటల సమయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు.. కానీ ఒకతను వచ్చాడు. ఏకంగా ఎమ్మెల్యేపై దాడికి దిగాడు. గొడవ ఎందుకు జరిగిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. వీడియో మాత్రం ట్రోల్ అవుతుంది.
మున్సిపల్ ఎన్నికలపై ఆప్- బీజేపీ హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. తామే అధికారం చేపడుతామని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేపై దాడి జరగడం కలకలం రేగింది. మరీ దీనిపై ఇప్పటివరకు ఆప్ స్పందించలేదు.












Click it and Unblock the Notifications