వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: ఓటు అడగడానికి వెళ్తే.. పెళ్లి ప్రపోజల్స్: ఆప్ అభ్యర్థికి భలే డిమాండ్..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆయన పేరు రాఘవ్ చడ్డా. వయస్సు 31 సంవత్సరాలు. ఉన్నత విద్యావంతుడు. అవివాహితుడు. ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నారు. వృత్తి ఛార్టెడ్ అకౌంటెంట్. ప్రవృత్తి రాజకీయాలు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యాన్ని వహిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీలో డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఢిల్లీ పరిధిలోని రాజీందర్ నగర్ నియోజకవర్గం నుంచి పొటీ చేస్తున్నారు.

మోడీ మా ప్రధాని: పాక్ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్మోడీ మా ప్రధాని: పాక్ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్

ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాఘవ్ చడ్డాకు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓటు అడగడానికి ఆయన వెళ్లాల్సి వస్తే.. తనను పెళ్లి చేసుకుంటావా? అంటూ అడిగే అమ్మాయిల సంఖ్య డజనుకు పైమాటే. మోప్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ధనిక, మధ్య తరగతి కుటుంబీకులు నివాసం ఉంటోన్న రాజీందర్ నగర్ నియోజకవర్గంలో ఆయనకు మంచి గుర్తింపు ఉందట.

Raghav Chada

ఇంకా పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఓట్ల కోసం వెళ్లిన ప్రతీచోటా యువతులు పెళ్లి ప్రపోజల్స్‌ను తీసుకొస్తున్నారట. తాను ఓట్లు అడిగితే.. వాళ్లేమో పెళ్లి చేసుకోవాలంటూ షరతు పెడుతున్నారని రాఘవ్ చెబుతున్నారు. రాజకీయాలపై మంచి పట్టు, జనం నాడిని పట్టుకోగల సామర్థ్యం, కలుపుగోలుతనం వల్ల ఓటర్లను ఇట్టే ఆకర్షిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెబుతున్నారు. గత ఏడాది ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా రాఘవ్ చడ్డా పోటీ చేసినప్పటికీ. ఓటమి చవి చూశారు.

Raghav Chada

ఆ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆప్ నాయకులు. ఈ పెళ్లి ప్రపోజల్సన్నీ ఓట్లుగా మారతాయా? లేవా? అనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ పూర్తి కానుంది. 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నట్లు సర్వేలు అంచనా వేశాయి.

English summary
Aam Aadmi Party (AAP) leader Raghav Chadha, a candidate for the Saturday Delhi election, has drawn support of a different kind during his campaign, and it is not clear whether all of it will translate into votes. He has been bombarded with marriage proposals, at least a dozen, according to his social media team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X