వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక సెలవు: పుట్టిన ఊరిలోనే స్మారకం, అన్నీ తానైన వెంకయ్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆయన సొంత ఊరు రామేశ్వరంలో ముగిశాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని మోడీతో పాటు రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్, ఏపీ, కేరళ, కర్ణాటకకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

మూడు రోజుల క్రితం షిల్లాంగ్‌లోని ఐఐటీలో ప్రసంగిస్తూ తుది శ్వాస విడిచిన కలాం భౌతిక కాయాన్ని ఆ మురసటి రోజు ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఆయన నివాసానికి తరలించారు. ఢిల్లీలో ఆయన పార్ధీవ దేహానికి నివాళులర్పించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఆ తర్వాత కలాం అంత్యక్రియలు ముగిసేదాకా అన్నీ తానై వ్యవహరించారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కలాం పార్ధీవ దేహాన్ని మధురైకి తరలించారు. మధురై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామేశ్వరానికి తరలించారు. ఈ క్రమంలో కలాం భౌతిక కాయం వెంట రక్షణ శాఖ మనోహర్ పారికర్‌తో కలిసి వచ్చిన వెంకయ్యనాయుడు రెండు రోజులుగా రామేశ్వరంలోనే ఉండి కలాం అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

ఈ ఉదయం 11:45 గంటల సమయంలో ప్రముఖలు తుది నివాళులు అర్పించిన తర్వాత, ప్రత్యేక ప్రార్థనల మధ్య ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు. అంతకుముందు సైనిక లాంఛనాల సూచకంగా, గాల్లోకి కాల్పులు జరిపారు.

'కలాం అమర్ రహే' అంటూ అభిమానుల నినాదాలు మిన్నంటాయి. అంత్యక్రియలు ముగిసిన అనంతరం ప్రధాని మోడీతో కలిసి అంత్యక్రియలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

ఇక అబ్దుల్ కలాం పుట్టిన ఊరైన రామేశ్వరంలోనే ఆయన స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ఢిల్లీలోని గాంధీ సమాధి పక్కన ఆయన స్మారక నిర్మాణాన్ని నిర్మాంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే కుటుంబ సభ్యుల మాత్రం రామేశ్వరంలోనే నిర్మించాలని కోరారు.

ఆ మేరకు తగిన స్థలాన్నిపరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించడంతో పేక్కరుంబులో ప్రభుత్వానికి చెందిన 1.32 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. రామేశ్వరం బస్ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.

English summary
Dr Abdul Kalam Kalam passed away on July 27th in Shillong while delivering a lecture at IIM. He was put to rest at Paikarumbu burial grounds in Rameswaram with full state and military honour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X