"లోక్‍ సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు పెట్టండి"

తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావడానికి కేంద్ర ఎన్నికల సంఘం సాయం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. లోక్ సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో భారీ తప్పిదాలు ఉన్నాయని అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఈ మేరకు కోల్ కతా ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఓట్లను ట్యాంపరింగ్ చేసి బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని అన్నారు.

" ఒక్క ఎపిక్ నెంబర్ లో అనేకమంది ఓటర్లు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమాచారం ఇవ్వలేదు. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ డేటా. బీజేపీ ఈసీను ఎందుకు సమర్థిస్తోంది. వీటికి బీజేపీ సమాధానం చెప్పాలి. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లోనూ తప్పుల తడకగా ఓటర్ లిస్టులు ఉన్నాయి. ఇది కేవలం బెంగాల్, బిహార్ లోనే కాదు. ఇది నేషనల్ ప్రాబ్లెమ్. బీజేపీ కావాలనే కొన్ని రాష్ట్రాలను ఎంచుకుని ఇలా చేస్తోంది" అని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.

ఓటర్ లిస్టుల్లో ఏమైనా అవకతవకలు జరిగితే లోక్ సభను రద్దు చేయండి. అప్పుడు అందరు ఎంపీలు, ప్రధాని, హోం మంత్రి పదవులకు రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేద్దాం.. అని అన్నారు. అలాగే మాజీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

Abhishek Banerjee Demands Lok Sabha Dissolution Calls for Fresh Elections

మరోవైపు ఓట్ల చోరీపై విపక్ష పార్టీలు సోమవారం పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం దాకా నిరసన ర్యాలీ చేపట్టాయి. అయితే ఈ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి విపక్ష నేతలను అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఆ తర్వాత విడుదల చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది రాజకీయ పోరాటం కాదని.. రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధం అని పేర్కొన్నారు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలు, డేటాను ఈసీ వెబ్ సైట్ నుంచే తీసుకున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+