ABP Cvoter Opinion Poll: అధికారంలోకి వచ్చేదెవరో అప్పుడే తేలిపోయిందిగా

బెంగళూరు: పొరుగునే ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకేదఫాలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ఉదయం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనట్లు ప్రకటించారు. ఇవ్వాళ్టి నుంచే ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చింది.

ఈ పరిణామాల మధ్య అంచనాలు, ఒపీనియన్ పోల్స్ వెలువడుతున్నాయి. తాజాగా ఏబీపీ సీఓటర్- ఇదివరకే తాను నిర్వహించిన ఒపీనియన్ పోల్ ను వెల్లడించింది. కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సర్వే చేపట్టిందా సంస్థ. అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, పురుషులు, యువకులు, విద్యార్థులు, వారి వయస్సు.. ఇలా అందరి అభిప్రాయాలను సేకరించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంది.

ABP Cvoter Opinion Poll on Karnataka: congress will got obsolute majority, here is the details

ఈ ఒపీనియన్ ప్రకారం- ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అంచనా వేసింది. సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. మొత్తం 224 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 115 నుంచి 127 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. బీజేపీ ఈ దఫా ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని అభిప్రాయపడింది. బీజేపీకి 68 నుంచి 80 వరకు సీట్లు దక్కొచ్చని తెలిపింది. పలువురు సీనియర్ నేతలకు ఓటమి తప్పకపోవచ్చని పేర్కొంది.

మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)కు ఆశించిన స్థాయిలో సీట్లు లభించే అవకాశాలు లేవని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. జేడీఎస్‌కు 23 నుంచి 35 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. ఇతరులు రెండు స్థానాలకే పరిమితం కావొచ్చని తెలిపింది. ఓల్డ్ మైసూరు రీజియన్‌లో మొత్తం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 55 కాగా.. ఇందులో బీజేపీకి 1 నుంచి 5 స్థానాలు దక్కుతాయి. కాంగ్రెస్ 24 నుంచి 28, జేడీఎస్ 26 నుంచి 27 సీట్లను సాధిస్తాయి.

గ్రేటర్ బెంగళూరులో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 32 కాగా.. ఇందులో బీజేపీకి దక్కేవి 11 నుంచి 15 సీట్లే. కాంగ్రెస్ 15 నుంచి 19 సీట్లను తన ఖాతాలో వేసుకోగలుగుతుంది. జేడీఎస్‌కు దక్కే స్థానాలు 1 నుంచి 3 వరకు ఉండొచ్చు. సెంట్రల్ కర్ణాటక రీజియన్ లో మొత్తం 35 సీట్లు ఉండగా.. అందులో బీజేపీకి 12 నుంచి 16, కాంగ్రెస్ కు 18 నుంచి 22, జేడీఎస్ కు ఒకటి లేదా రెండు స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ తెలిపింది.

21 అసెంబ్లీ స్థానాలు ఉన్న కోస్టల్ కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్- బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇక్కడ బీజేపీకి దక్కే స్థానాలు 9 నుంచి 13 వరకు ఉండొచ్చని పేర్కొంది. కాంగ్రెస్ 8 నుంచి 12 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది. ఇక కల్యాణ కర్ణాటక (హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌)లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. ఇక్కడ బీజేపీ 8 నుంచి 12 సీట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ 19 నుంచి 23 స్థానాలను కైవసం చేసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+