కెప్టెన్ కోహ్లీ స్వచ్ఛతకు ముగ్ధుడైన మోడీ: ట్విట్టర్‌లో అభినందన
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో కోహ్లీసేన టెస్టు సిరిస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్‌లో భాగంగా హోళ్కర్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటన వీడియోని ఏబీపీ న్యూస్ ఛానెల్ ప్రముఖంగా చూపించింది.
ఆ వీడియోలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో బాటిళ్లను, చెత్తను ఏరి కోహ్లీ చెత్తడబ్బాలో వేసే దృశ్యాలను ప్రధాన మోడీ కూడా చూశారు. స్వచ్ఛభారత్ పిలుపునకు స్పందనగా కోహ్లీ చెత్త ఏరివేయడం చిన్న పనే అయినా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేదిలా ఉందంటూ ప్రధాని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

దీనికి కోహ్లీ వెంటనే బదులు ఇచ్చాడు. ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పాడు. దేశానికి మోడీ నేతృత్వం అందరికీ స్ఫూర్తినిస్తోందంటూ కోహ్లీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. దేశం మరింత సుందరంగా, భిన్నంగా కనిపించాలన్న ప్రధాని పిలుపుమేరకు తామంతా కూడా పని చేస్తున్నామని అందులో పేర్కొన్నాడు.
Dear @imVkohli, saw your #MyCleanIndia moment on @abpnewstv. A small but powerful gesture that will surely inspire everyone.
— Narendra Modi (@narendramodi) October 7, 2016
Thank you @narendramodi sir. We all are trying to make a difference for the betterment of our country. Led in an inspirational way by you.
— Virat Kohli (@imVkohli) October 7, 2016












Click it and Unblock the Notifications