వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనాభా సమతుల్యతకే ‘370’ రద్దు డిమాండ్: స్వామి స్వరూపానంద

|
Google Oneindia TeluguNews

హరిద్వార్: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణంపై శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆ రాష్ట్రంలో జనాభా సమతుల్యత కోసమే ఆ ఆర్టికల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఆర్టికల్‌ను రద్దు ద్వారానే కాశ్మీర్‌లోయలో ఘర్షణలకు చరమగీతం పాడవచ్చునని ఆయన గురువారం అన్నారు. పంజాబ్‌లో హిందువులు, సిక్కులు సమానంగా ఉండడం వల్లనే ఘర్షణలు జరుగడం లేదన్నారు. కేంద్ర చట్టాల్లో లోపాల వల్లే కాశ్మీర్‌లో దేశ ద్రోహ శక్తులు పెరిగిపోతున్నాయని స్వరూపానంద ఆరోపించారు.

Abrogate Art 370 for demographic balance in J-K:Swaroopanand

కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలకు వెళ్లినప్పుడే ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న దేశద్రోహ శక్తుల ఆగడాలను ఎదుర్కోగలమన్నారు. హిందూ, ముస్లింలకు ఉమ్మడి పౌర స్మృతి అమలుతోనే దేశ జనాభాలో సమతుల్యత సాధించగలమన్నారు.

లౌకికవాదం వల్లే చిన్నారులకు మతం గురించి తెలియడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ నాయకులకు, ప్రతినిధులకు భగవద్గీత ప్రతులు బహుమతిగా ఇవ్వడం పట్ల ఆశ్చర్యం చేసిన ఆయన, ఆ గ్రంథాన్ని భారత చిన్నారులకు ఇవ్వలేకపోతున్నామని అన్నారు.

English summary
Shankaracharya Swami Swaroopanand Saraswati kicked up controversy today by saying that abrogation of article 370 can pave the way for striking a "demographic balance" in Jammu and Kashmir which is necessary to put an end to recurring strifes in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X