అయోధ్య రామ మందిరం మీద పచ్చ జెండాలు, ఎడిట్ చేసి షేర్ చేసిన తాజుద్దీన్, కుష్కా పెట్టిన మామలు!
అయోధ్యలోని రామమందిరంపై పచ్చజెండా (ముస్లీంలు ఉపయోగించే జెండా) ఊపినట్లు ఉండే చిత్రాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దేశం మొత్తం శ్రీరామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఇతన సమాజంలో అలజడి రేపడానికి, ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడు. సోమవారం రోజు దేశంలో ప్రతి ఒక్క హిందువూ శ్రీరాముడి పేరును జపిస్తున్నారు.
ఉపవాసం, ప్రత్యేక పూజలు, దానధర్మాలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలలో హిందువులు నిమగ్నమైనారు. సోమవారం ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన రహదారులు, సందుల్లో కూడా శ్రీరాముడి చిత్రంతో కూడిన ఫ్లెక్సీలు, కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలోని గదగ్ జిల్లా గజేంద్రగడ్ పట్టణంలో తాజుద్దీన్ దఫేదార్ అనే నిందితుడు అయోధ్య రామ మందిరం విషయంలో చెయ్యరానిపని చేశాడు.

రామమందిరంపై దర్గాలు, మసీదులు దగ్గర కట్టే పచ్చజెండా ఎగరినట్లు ఉండే ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నిందితుడు తాజుద్దీన్ పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపింది. ఈరోజు అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇదిలా ఉండగా ఇదే రోజు ఈ దారుణం చోటుచేసుకుంది. దీనిపై హిందూ అనుకూల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే నిందితుతడినై చర్యలు తీసుకోవాలని, నిందితులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు. గజేంద్రగఢ్ పోలీసులు తాజుద్దీన్ దఫేదార్ అలియాస్ తాజుద్దీన్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత బెన్నాల్ పట్టాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులను అరెస్టు చెయ్యాలని ధర్నా నిర్వహించారు.

సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయోధ్య నేడు ఆకర్షణీయంగా అలంకరించబడింది. శ్రీరాముని స్వాగతించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. రామమందిరంలో ఇప్పటికే పలు పూజ పునస్కారాలు జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ పండుగను చూసేందుకు దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా అతిథులను ఆహ్వానిస్తారు. ఇలా ఒక్క అయోధ్యే కాదు దేశంలోని ప్రతి రాష్ట్రాంలో, జిల్లాలో, ప్రతిగామంలో పండుగ వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications