బోయాపాటి సినిమా స్టైల్లో ఫ్రెండ్ ను చంపేశారు, స్కార్పియో ఎంట్రీతో పోలీసుల మైండ్ బ్లాక్ !
బెంగళూరు: కేసు ఉపసంహరించుకునేందుకు అంగీకరించకపోవడంతో స్కార్పియో కారుతో ఢీకొన్ని సినిమా స్టైల్‌లో అందరి ముందు దారుణంగా హత్య చేసిన నిందితుతులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఫ్రేజర్‌టౌన్ లో నివాసం ఉంటున్న సయ్యద్ అస్గర్ హత్యకు గురైన వ్యక్తి. ముజాహిద్ గాయపడ్డాడు (అస్గర్ స్నేహితుడు) అమీన్, జేసీ నగర్‌కు చెందిన నవాజ్ అనే నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఇదే సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సయ్యద అస్గర్ హత్యకు గురైనాడు. హత్యకు గురైన అస్గర్ గుజారీ వ్యాపారి. అతని స్నేహితుడు ముజాహిద్ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసేవాడు. ముందుగా తెలిసిన నిందితుడు అమీన్‌కు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు. రెండు విలువైన కార్లను అస్కర్ అమీన్ కు ఇచ్చాడు. అయితే కారు కొని ఎనిమిది నెలలు కావస్తున్నా అమీన్ డబ్బులు తిరిగి ఇవ్వలేదు.

రూ 4 లక్షల రూ. డబ్బుల కోసం అస్కర్, అమీన్ మధ్య గొడవ జరిగింది. డబ్బు అడిగినందుకు అమీన్, స్నేహితుడు కలిసి అస్గర్‌పై దాడి చేశారు. ఈ విషయమై అస్గర్ బెంగళూరు నగరంలోని జేసీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో అమీన్‌పై జేసీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసి కేసు ఉపసంహరించుకోవాలని నిందితులు అస్గర్ ను బెదిరించారు.
అస్గర్‌కి ఫోన్ చేసి మనం మాట్లాడుకుందామని, డబ్బులు సెటిల్ మెంట్ చేసుకుందామని అతనికి చెప్పారు. అస్గర్ మాత్రం కొన్ని రోజులు నిందితుల చెప్పిన డిమాండ్ కు అంగీకరించలేదని తెలిసింది. అస్గర్‌కు ఫోన్ చేసిన నిందితులు కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయితే తన స్నేహితుడు ముజాహిద్‌తో కలిసి అస్గర్ బైక్‌పై నిందితులు చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు.
కేసును వెనక్కి తీసుకోలేనని చెప్పిన అస్గర్ ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అస్గర్ తన స్నేహితుడిని దింపేందుకు కుమ్మరి రోడ్డుకు బైక్ లో వచ్చాడు. అస్గర్ బయటకు వెళ్లిన వెంటనే నిందితులు స్కార్పియో కారులో అతని వెంబడించారు. అస్గర్ ను చంపేస్తే దరిద్రం పోతుందని, అతన్ని స్కార్పియో కారులో కిడ్నాప్ చేసి అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

అస్గర్ అతని స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు కుమ్మరి రోడ్డుకు వెళ్తున్నాడని తెలిసి స్కార్పియో కారులో అతడిని అనుసరించాడు. బైక్ నుండి దిగుతున్నప్పుడు వెనుక నుండి కారుతో వారి బైక్ ను ఢీకొట్టి చంపేయాలని స్కెచ్ వేశారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం అని చెప్పి కేు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. బైక్‌ను వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. అయితే కిందపడిన అస్గర్ చనిపోకపోవడంతో అతని మీద దారుణంగా దాడి చేశారు.
తీవ్ర గాయాలపాలైన అస్గర్ మృతి చెందాడు. అస్గర్ స్నేహితుడు ముజాహిద్‌కు గాయాలయ్యాయి. మొదట బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రమాదమేనంటూ కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన ముజాహిద్ స్నేహితుడి ఆసుపత్రిలో చికిత్స పొందికొలుకున్న తరువాత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మొజాహిద్ స్టేట్ మెంట్ తో అస్గర్ హత్య కేసు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు అమీన్, నవాజ్‌లను బెంగళూరులోని పులికేశినగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications