ఏటీఎం కార్డులు మార్చేసి వీడు ఏం చేస్తున్నాడంటే ?, 420 బాబా కహానితో షాక్ !

బెంగళూరు: ఇటీవల కాలంలో చాలా మంది చాలా సులభంగా డబ్బులు సంపాధించాలని ప్లాన్లు వేస్తున్నారు. ఉద్దరగా డబ్బులు సంపాధించి విలాసవంతమైన జీవితం గడపడానికి చాలా మంది అనేక స్కెచ్ లు వేస్తున్నారు. ఏదో ఒక విదంగా డబ్బులు సంపాధించి కాలం గడిపేస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు.

సహాయం చేస్తామని చెప్పి ఏటీఎం కార్డు మార్చారు. రూ. 25,100 డ్రా చేసిన నిందితుడిని మూడు రోజుల్లోనే కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని యల్లాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన అమూల్ భగవాన్ షిండే (33) అరెస్టు అయిన నిందితుడు. విచారణలో నిందితుడు షిండే అంతర్ రాష్ట్ర దొంగ అని అంతర్ రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకలో నిందితుడి మీద నమోదైయ్యిందని పోలీసు అధికారులు తెలిపారు.

Accused who was cheating by changing ATM cards arrested in Karnataka.

యల్లాపుర్ పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో నిందితులు ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు ఫిర్యాదుదారుడికి సహకరించి అదే రోజు శిరసిలోని ఏటీఎంలో ఫిర్యాదుదారుడి ఖాతా నుంచి ఏటీఎం కార్డును మార్చారు. తరువాత వారి తెలివితేటలు ఉపయోగించి ఏటీఎంలో రూ. 25,100 డ్రా చేసుకున్నారు. మోసపోయిన బాధితుడు ఫిర్యాదు చెయ్యడంతో యల్లాపూర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది.

ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితుడు షిండేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దాపూర్, అంకోలా, బెళగావి, ఏపీఎంసీ యార్డు, మహారాష్ట్రలోని చందాగఢ్, కాగల్, మురగోడ, మలాషిరస్, మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్లలో నిందితుడు షిండే మీద ఇలాంటి చీటింగ్ కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూసిందని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు షిండే నునంచి 12, 000 నగదు, లూటీలకు ఉపయోగిస్తున్న ఏటీఎం కార్డులు, రూ. 75 వేల విలువైన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+