కల్చరల్ క్లబ్ ‘ఆలె’ను ప్రారంభించిన ఆచార్య సంస్థలు
బెంగళూరు: ఆచార్య ఇనిస్టిట్యూట్స్ ఆధ్వర్యంలో ఆర్ట్స్, కల్చరల్ క్లబ్ ‘ఆలె'(ALEY)ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రంలో ముఖ్య కళలో ఒకటైన ‘డొళ్లు కునిత'ను ప్రదర్శించారు. వారసత్వంగా వస్తున్న కళలను కాపాడుకునేందుకు ఈ ప్రదర్శన ద్వారా ఓ సందేశం ఇచ్చారు.
వారం రోజులపాటు సమయం తీసుకున్న విద్యార్థులు ‘ఆలె'పై క్యాంపస్, ఫేస్‌బుక్‌లలో ప్రచారం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 12.30 నుంచి క్యాంపస్ నలుమూలాల విద్యార్థులు డ్రమ్స్ వాయించుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. నలువైపుల నుంచి ఊరేగింపుగా వచ్చిన విద్యార్థులు వేదికవద్దకు చేరుకున్నారు.

వేదిక దగ్గర కొందరు విద్యార్థులు పులి వేశాలతో నృత్యాలు చేశారు. మరికొందరు విద్యార్థులు వివిధ వేశాలతో అభినయించారు. టపాసులు పేల్ల్చారు. అంతర్జాతీయ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘ఆలె' క్లబ్ ప్రారంభించబడింది. ఈ క్లబ్ ఆధ్వర్యంలో యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి వారికి తగిన తర్ఫీదును ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. థియేటర్ అక్టివిటీస్, పాటలు, డాన్సులు, డిజైన్, లిటరేచర్ అక్టివిటీస్, చిత్రలేఖనం మొదలైన వాటిలో యువతకు క్లబ్ ప్రోత్సాహం కల్పిస్తుంది.
ఈ క్లబ్ యువత, కళాకారులను ప్రోత్సహించే ఓ వేదికగా ఉంటుందని ఆలె విద్యార్థులు తెలిపారు. ఆర్ట్స్, కల్చరల్ రంగంలో ఎవరైతే తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలనుకుంటున్నారో వారందరూ క్లబ్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని వారు తెలిపారు. యువత నైపుణ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రదర్శించేందుకు క్లబ్ పనిచేస్తుందని ఎం.కాం. విద్యార్థి దిలీప్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆచార్య ఇన్‌స్టిట్యూట్స్ కార్పొరేట్ అండ్ మీడియా సంబంధాల మేనేజర్, ఆలె కల్చరల్ సెక్రటరీ సంతోష్ అనంతపుర మాట్లాడుతూ.. యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు విద్యార్థులు ఆలె క్లబ్‌ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. విద్యార్థులు క్లబ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్లబ్ ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications