కర్ణాటకలో మహిళపై యాసిడ్ దాడి, కేసు నమోదు
న్యూఢిల్లీ: ప్రైవేటు స్కూల్లో పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ మహిళపై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా మంచేనహళ్లి శివార్లలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో వివాహిత లక్ష్మమ్మ (35) సమీపంలో ఉన్న ప్రైవేటు స్కూల్లో పనులు ముగించుకుని ఇంటికి నడిచి వస్తున్న సమయంలో దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఒక్కాసరిగా సీసాలో తెచ్చిన యాసిడ్ ఆమెపైకి విసిరాడు.

దీంతో విపరీతమైన మంటలతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న మంజేనహళ్లి ఎస్సై సుందర్ సంఘటనా స్ధలానికి చేరుకుని ఆమెను గౌరిబిదనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ఆమె ఎడమ కన్ను పూర్తిగా కాలి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను బెంగుళూరుకు పంపారు. దుండగుల్లో ఒకరు హెల్మెట్ పెట్టుకోగా.. మరొకరు ముఖం కనిపించకుండా వస్త్రం లాంటిది కట్టుకున్నాడని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
యాసిడ్ దాడికి వినియోగించిన ద్విచక్రవాహనాన్ని ఇంకా గుర్చించలేదు. కేసు నమోదు చేసుకున్న మంచేనహళ్లి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.












Click it and Unblock the Notifications