పాక్ భాషలోనే సమాధానం చెప్పాలి: ప్రవీణ్ తొగాడియా
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఉగ్ర దాడిని భారత్ దేశంపై పాకిస్తాన్ యుద్ధ ప్రేరేపిత చర్యగా విశ్వ హిందూ పరిషత్తు నాయకుడు ప్రవీణ్ తొగాడియా మంగళవారం నాడు అభివర్ణించారు. దీనికి దౌత్యపరంగా లేదా చర్చల ద్వారా ప్రత్యుత్తరమివ్వడం సాధ్యపడదని అభిప్రాయపడ్డారు.
ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. భారత్ విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా వ్యవహరించడం లేదని, దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మసూద్‌లను ఇప్పటి వరకూ మనకు అప్పగించలేదన్నారు.

ఇలాంటి ముష్కరులను కట్టడి చేయాలని పాకిస్తాన్ అసలు అనుకోవడమే లేదన్నారు. ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. అతను పంజాబ్‌లోని పాన్వాడలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications