కేజ్రీవాల్‌కు మరో షాక్: పార్టీకి మేధా పాట్కర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో కుదుపునకు గురైంది. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత పోరు పట్ల ఆమె తీవ్ర ఆసంతృప్తికి గురయ్యారు.
ప్రశాంత్ భూషణ్ వివిధ అవినీతి కుంభకోణాలపై చేసిన పోరాటం దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని పటిష్టపరచడంలో ఉపయోగపడిందని ఆమె అన్నారు. యోగేంద్ర యాదవ్ రైతుల వద్దకు, కింది స్థాయిలోని ప్రజల వద్దకు వెళ్లారని, వారు పార్టీని బలపరిచారని ఆమె అన్నారు .

వారిద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తనకు తెలియదని ఆమె అన్నారు. అయితే, తాను ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేయడానికి కూడా సిద్ధంగా లేనని మేధా పాట్కర్ అన్నారు. పార్టీ అంతర్గత పోరాటం ముందుకు రావడం విచారకరమని మేధా పాట్కర్ అన్నారు. పార్టీలో పదవులు ఇస్తామంటే తాను అంగీకరించలేదని, ఈ రోజు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని ఆమె అన్నారు.
వేటుపడిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పార్టీలో అసంతృప్తి తలెత్తితే నిర్దాక్షిణ్యంగా అణచివేయడానకి కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తారని నేటి సంఘటన తెలియజేస్తోందని వారన్నారు.












Click it and Unblock the Notifications