కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో..రెజ్లర్: హోం క్వారంటైన్‌లోకి: అసింప్టోమేటిక్‌గా

న్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, రెజ్లర్ దీపక్ పునియా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిద్దరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదు. కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్ట్.. పాజిటివ్‌గా వచ్చింది. దీనితో డాక్టర్ల సలహా మేరకు వారు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ మధ్యకాలంలో తమను కలిసి వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. తమ ఆరోగ్యం బాగుందని, త్వరలోనే నెగెటివ్ రిపోర్ట్‌తో వస్తామని పేర్కొన్నారు.

Recommended Video

    COVID-19 In India : 90,633 కొత్త కేసులు, US, Brazil కలిపినా ఇండియాకు సమానం కాలేదు!! | Oneindi Telugu

    తాను కరోనా వైరస్ బారిన పడిన విషయాన్ని అర్జున్ కపూర్.. తన అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనలో వైరస్ లక్షణాలు లేవని తెలిపారు. డాక్టర్లు అసింప్టోమేటిక్‌గా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగుందని, అభిమానులు ఆందోళన పడొద్దని చెప్పారు. డాక్టర్ల సలహా మేరకు తాను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని అన్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా వెల్లడిస్తుంటానని చెప్పారు.

    Actor Arjun Kapoor and Wrestler Deepak Punia tests positive for covid

    కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఆందోళనతో ఫోన్ కాల్స్ చేస్తున్నారని, వాటికి తాను ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని చెప్పారు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఙతలు తెలుపుతున్నానని అర్జున్ కపూర్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ గండం నుంచి గట్టెక్కుతానని, నెగెటివ్ రిపోర్ట్‌తో బయటికి వస్తానని చెప్పారు.

    ప్రముఖ రెజ్లర్ దీపక్ పునియా కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనలో కూడా వైరస్ లక్షణాలేవీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు సాయ్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. హర్యానాలోని సోనేపట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా శిబిరానికి ఆయన హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు ఆయన హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+