వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ పార్టీలోకి 'కీ'లక వ్యక్తులు: మోడీకి ఘాటు లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి)లో జాతిపిత మహాత్మా గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ చేరారు. ఆయన ఢిల్లీ నుండి లోకసభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. రాజ్ మోహన్ గాంధీ రచయిత. ఆయన 1989లో జనతాదళ్ తరఫున అమేథీ నుండి రాజీవ్ గాంధీ పైన పోటీ చేసి ఓడిపోయారు.

బాలీవుడ్ నటుడు గుల్ పతంగ్ తండ్రి, లెఫ్టినెంట్ జనరల్ పంతగ్ ఎఎపితో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మాత్రం ఆసక్తి లేదంటున్నారు. తాను పార్టీకి సేవలందిస్తానని చెప్పారు.

Actor Gul Panag's father, Lt Gen Panag joins AAP

జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతానని చెప్పారు. వ్యక్తిగతంగా ఎఎపి పార్టీ పని తీరు తనకు నచ్చినట్లు పతంగ్ చెప్పారు. అతను ఎఎపికి జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై సూచనలు ఇస్తారు.

మరోవైపు ఢిల్లీలో సత్తా చాటిన ఎఎపి ముంబైపై ప్రధానంగా దృష్టి సారించింది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం కోసం ఉత్సుకత చూపిస్తోంది. ముంబైలో పాతుకు పోయేందుకు రాష్ట్రంలోని పలు కుంభకోణాలను లేవనెత్తుతోంది. పార్టీ సీనియర్ నేత అంజలీ దమానియా ముంబైలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రులు, అధికారుల అనివీతిపై ఆమె ప్రశ్నిస్తున్నారు.

మోడీకి కేజ్రీవాల్ లేఖ

గ్యాస్ ధరల పెంపు విషయంలో కేంద్రం ముఖేష్ అంబానీ తరఫున నిలబడుతోందని ఆరోపిస్తూ, దీనిపై అభిప్రాయం తెలపాలని కేజ్రీవాల్ బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీకి లేఖ రాశారు. అంబానితో మీకు, మీ పార్టీకి ఉన్న సంబంధమేమిటని, మీ బహిరంగ సభలకు, ర్యాలీలకు కోట్లు ఎక్కడి నుండి వస్తున్నయని కేజ్రీవాల్ లేఖలో ప్రశ్నించారు.

English summary
The simplicity, humble attitude of the Aam Aadmi Party (AAP) and its members is what drew Lt Gen Panag to join the AAP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X