ఈగ‘ఫేం’సుదీప్ దంపతులపై కోర్టు ఆగ్రహం, మీరు సంతోషంగా ఉంటే కోర్టులో ఎందుకు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బహుబాషా నటుడు, కన్నడ హీరో 'ఈగ ఫేం'కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియా రాధాకృష్ణన్ ల మీద బెంగళూరు ఫ్యామిలీ కోర్టు మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సుదీప్, ప్రియా రాధాకృష్ణన్ దంపతులు రాజీ అయితే వెంటనే విడాకుల కోసం సమర్పించిన అర్జీ వెనక్కి తీసుకోవాలని సూచించింది.

అంతే కానీ విడాకుల అర్జీ వాపస్ తీసుకోకుండా అనవసరంగా కోర్టు సమయాన్ని వృదా చేస్తున్నారు అంటూ న్యాయస్థానం మండిపడింది. సుదీప్, ప్రియా రాధాకృష్ణన్ దంపతులు ఎక్కడ ఉన్నా సరే ఆగస్టు 24వ తేదీ కచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Actor Kichcha Sudeep who is busy in The Villain film shooting and his wife

2015 సెఫ్టెంబర్ నెలలో సుదీప్, ప్రియా రాధాకృష్ణన్ దంపతులు మాకు విడాకులు కావాలంటూ బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. హీరో సుదీప్ తరపున ఆయన సోదరి కోర్టుకు హాజరౌతున్నారు. అప్పటి నుంచి విడాకుల అర్జీ విచారణ జరుగుతోంది.

అయితే సుదీప్, ప్రియా రాధాకృష్ణన్ దంపతులు సంతోషంగా, అన్యోన్యంగానే ఉన్నారంటూ వారి తరపున న్యాయవాదులు కోర్టులో చెప్పడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంతోషంగా ఉంటే మరి విడాకుల కోసం అర్జీ ఎందుకు సమర్పీంచారు అంటూ న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Kichcha Sudeep who is busy in The Villain film shooting and his wife Priya did not turn up at the family court on June 14 for a hearing on their divorce. The case is adjourned to August 24 for the final hearing and both have to appear before court in person.
Please Wait while comments are loading...