నటి మమతా కుల్‌కర్ణికి షాక్: బ్యాంకు ఖాతాల స్తంభన

Subscribe to Oneindia Telugu

థానే: రూ. 2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆమెకు చెందిన ఎనిమిది బ్యాంకు ఖాతాలను థానే పోలీసులు స్తంభింపజేశారు.

కాగా, ఈ ఖాతాల్లో రూ.90 లక్షలకుపైగా నగదు ఉంది. రూ.రెండు వేల కోట్ల ఎఫిడ్రిన్‌ మాదకద్రవ్యాల రాకెట్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారి, ఆమె భాగస్వామి అయిన వికీ గోస్వామి.. ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నట్లు ఓ సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు.

Also Read: డ్రగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది: చిక్కుల్లో నటి మమత కులకర్ణి

Actor Mamta Kulkarni’s bank accounts frozen

మలడ్‌లోని ఓ బ్యాంకు ఖాతాలో రూ.67 లక్షల విలువైన విదేశీ నగదును కనుగొన్నారు. మిగిలిన రూ.26 లక్షలు థానే, గుజరాత్‌లోని బ్యాంకుల్లో దొరికాయి. బ్యాంకుల్లో లావాదేవీలు జరిపిన కుల్‌కర్ణి సోదరుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 17 మందిపై ఆరోపణలు రాగా పది మందిని అరెస్టు చేశారు.

మాదకద్రవ్యాలకు సంబంధించి కెన్యా, దుబాయిలలో జరిగిన సమావేశాల్లో కుల్‌కర్ణి పాల్గొన్నారు. ఆ భేటీల్లో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో అవన్‌ లైఫ్‌సైన్సెస్‌ లిమిటెడ్‌లో పోలీసులు రెండు నెలల క్రితం జరిపిన సోదాల్లో రూ.రెండు వేల కోట్ల విలువైన 18.5 కిలోల ఎఫిడ్రిన్‌ను ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police have frozen at least eight bank accounts—holding over Rs 90 lakh— of film actress Mamta Kulkarni in Gujarat, Mumbai and some adjoining areas in connection with the multi-crore ephedrine racket.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి