Tamil Nadu Shocker: మరో కీలక పరిణామం- విజయ్ ను దువ్వుతున్న డీఎంకే ఫ్రెండ్..!

తమిళనాడు (Tamil Nadu)లో ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో కొత్తగా స్దాపించిన విజయ్(Vijay) పార్టీ టీవీకే (TVK)అనుకున్న దాని కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పలు సంస్థలు తేల్చేశాయి. దీంతో ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మెజార్టీ సంస్థలు అంచనా వేస్తున్న డీఎంకేతో పాటు విపక్ష అన్నాడీఎంకే కూటమి కూడా విజయ్ పై ఫోకస్ పెట్టాయి.

Tamil Nadu Exit Poll: అన్నాడీఎంకేను మూడో స్ధానానికి నెట్టేసిన విజయ్-టుడేస్ చాణక్య పోల్..!
Tamil Nadu Exit Poll: అన్నాడీఎంకేను మూడో స్ధానానికి నెట్టేసిన విజయ్-టుడేస్ చాణక్య పోల్..!

ఈ నేపథ్యంలో అధికార డీఎంకే మిత్రపక్షమైన ఎండీఎంకే అధినేత వైకో.. విజయ్ పార్టీని 'లెక్కించదగిన శక్తి'గా అభివర్ణించారు.
ప్రజల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణను ప్రస్తావిస్తూ.. టీవీకే ఒక లెక్కించదగిన శక్తి, అది ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ ఉద్యమం శాశ్వత శక్తిగా నిలుస్తుందని కూడా వైకో అంచనా వేశారు. టీవీకే ఎంత బలంగా రాణించినా.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎప్పటినుంచో నిర్దేశిస్తున్న సైద్ధాంతిక పునాదులను అది మౌలికంగా కదిలించలేకపోవచ్చని ఆయన పరోక్షంగా తేల్చేశారు.

Exit Poll Shocker DMK Ally Backs Vijay s TVK After Stunning Debut Projections
Tamil Nadu Twist: ఎగ్టిట్ పోల్స్ తో తమిళ లెక్క మారిందా ? పార్టీల రియాక్షన్ ఇదే..!
Tamil Nadu Twist: ఎగ్టిట్ పోల్స్ తో తమిళ లెక్క మారిందా ? పార్టీల రియాక్షన్ ఇదే..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుని, బహుశా కింగ్‌మేకర్‌గా మారుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సెస్ మై ఇండియా అయితే విజయ్ పార్టీ.. 234 సీట్లకు గాను 98 నుంచి 120 సీట్ల వరకు గెలుచుకుని, సీనియర్ డీఎంకే పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందని తేల్చింది. అయితే, మిగతా అన్ని పోల్ అంచనాలు ఎంకే స్టాలిన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. అయితే యువత ఓట్లు సాధించడంలో విజయ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. తొలిసారి ఓటు వేస్తున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కూడా ఇందుకు ఒక ముఖ్య కారణం. అయితే గతంలో శివాజీ గణేషన్, విజయకాంత్, కమల్ హాసన్‌లతో సహా తమిళనాడు ముఖ్యమంత్రి రేసులో ఎందరో నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ విఫలమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ అయితే రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కింగ్ మేకర్ గా మారినా డీఎంకేకు భవిష్యత్తులో కష్టాలు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+