200ఎంపీ కెమెరాతో "Moto G87".. ఎంతంటే ??

ఇండియన్ మార్కెట్లో మోటారోలా మొబైల్స్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ టెక్ టెక్ ప్రియులను బాగా ఆకర్షించాయి. బడ్జెట్ రేంజ్ నుంచి ఫ్లాగ్ షిప్ రేంజ్ వరకు పలు ఫోన్‌లతో మంచిగా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి తమ వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. G సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌గా Moto G87ను ఆవిష్కరించింది.

ప్రీమియం ఫీచర్లను మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో అందించే లక్ష్యంతో వచ్చిన ఈ ఫోన్, 200MP కెమెరా, భారీ బ్యాటరీ, శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకుంటోంది. గత మోడల్ G77తో పోలిస్తే డిస్‌ప్లే, కెమెరా, సాఫ్ట్‌వేర్ రంగాల్లో గణనీయమైన అప్‌గ్రేడ్‌లతో ఇది వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

moto-launched-new-smart-phone-g87-that-price-and-specifications-full-details-also-availability

డిస్‌ప్లే & డిజైన్..

మోటో G87లో 6.78 అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ అందిస్తే, గరిష్టంగా 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్పష్టమైన వీక్షణ అనుభవాన్ని ఇస్తుంది. సాధారణ ఫుల్ HD కంటే సుమారు 17% అధిక రిజల్యూషన్ ఉండటం వల్ల వీడియోలు, గేమింగ్ మరింత క్లారిటీతో కనిపిస్తాయి. అదనంగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో స్క్రీన్ స్క్రాచ్లు, డ్యామేజ్‌లకు బలంగా ఉంటుంది. స్లిమ్ డిజైన్, ఫ్లాట్ ఎడ్జ్‌లు, పంచ్-హోల్ కెమెరా దీని లుక్‌ను ప్రీమియంగా మార్చుతున్నాయి.

పనితీరు & సాఫ్ట్‌వేర్..

ఈ స్మార్ట్‌ఫోన్ 6nm టెక్నాలజీపై ఆధారపడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్‌లో కూడా స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఆర్మ్ మాలి-G57 MC2 GPUను కలిగి ఉంది. ఇది 4GB/8GB LPDDR4x RAM మరియు 128GB/256GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. RAM బూస్ట్ ఫీచర్ ద్వారా వర్చువల్‌గా 24GB వరకు పెంచుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ పరంగా, ఇది తాజా Android 16తో వస్తోంది. మోటరోలా ప్రత్యేకత అయిన క్లీన్ UI, తక్కువ బ్లోట్వేర్‌తో సాఫ్ట్‌వేర్ అనుభవం సింపుల్‌గా, ఫాస్ట్‌గా ఉంటుంది. రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్, సిస్టమ్ అప్‌గ్రేడ్‌లను కంపెనీ హామీ ఇస్తోంది.

కెమెరా ఫీచర్లు..

మోటో G87లో ప్రధాన హైలైట్ 200MP ప్రైమరీ కెమెరా. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), అల్ట్రా పిక్సెల్ టెక్నాలజీతో ఇది వస్తుంది. తక్కువ కాంతిలో కూడా మెరుగైన ఫోటోలు తీసేందుకు 16 రెట్లు ఎక్కువ కాంతి సున్నితత్వాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

8MP అల్ట్రా-వైడ్ లెన్స్ (f/2.2)
32MP ఫ్రంట్ కెమెరా (సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం)

AI ఆధారిత ఫీచర్లు, నైట్ మోడ్, పోర్ట్రెట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ & ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో 5200mAh భారీ బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా ఉపయోగించవచ్చు. 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్ల వల్ల పవర్ వినియోగం తగ్గుతుంది.

ఇతర ఫీచర్లు..

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఫేస్ అన్‌లాక్ సపోర్ట్

డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లు

5G కనెక్టివిటీ, Wi-Fi, బ్లూటూత్ 5.3

IP రేటింగ్ (నీటి చినుకులు, ధూళి నుంచి రక్షణ)

ధర & లభ్యత..

మోటో G87 ప్రారంభ ధర 399 యూరోలు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు ₹45,000. ఇది తొలుత యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా (EMEA), లాటిన్ అమెరికా మార్కెట్లలో విడుదల కానుంది. భారత్‌లో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+