ఆసుపత్రిలో కరుణానిధి కుటుంబ సభ్యులతో భేటీ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్

చెన్నై: చెన్నైలోని అళ్వార్ పేట్ లోని కావేరీ ఆసుపత్రిలో ఐదు రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం. కరుణానిధిని పరామర్శించడానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లారు.

Recommended Video

    కరుణానిధి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన, 12 ఏళ్ల తర్వాత నెరవేరిన ఆయన కల!

    ఈ సందర్బంగా కరుణానిధి కుటుంబ సభ్యులను రజనీకాంత్ పరామర్శించారు. అనంతరం ఆసుపత్రిలో కరుణానిధి కుమారుడు. తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తో రజనీకాంత్ చర్చించారు. కరుణానిధి ఆరోగ్యం గురించి రజనీకాంత్ ఆరా తీశారు.

    Actor Rajinikanth visits Karunanidhi in Kauvery hospital in Chennai

    అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ దేశంలోనే అత్యంసీనియర్ రాజకీయ నాయకుడు అయిన కరుణానిధిని పరామర్శించడానికి తాను ఆసుపత్రికి వచ్చానని చెప్పారు. తాను ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కరుణానిధి నిద్రపోతున్నారని, వారి కుటుంబ సభ్యుల నుంచి ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వివరాలు సేకరించానని రజనీకాంత్ అన్నారు.

    కరుణానిధి త్వరగా కోలుకుంటారని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలకు ఎంతో సేవ చేసిన కరుణానిధికి ఏమీ జరగదని, ఆయన ఆరోగ్యం కుదటపడుతుందని, ఆయన అభిమానులు ఆందోళన చెందకూడదని రజనీకాంత్ అన్నారు. కరుణానిధిని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం చెన్నై వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+