హీరో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే: పోటీకి అభ్యర్థులు సిద్దం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: స్యాండిల్ వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. బహుబాష నటుడు, దర్శకుడు ఉపేంద్ర తన పార్టీ పేరును'కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ'(KPJP)అని ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించడమే తన పార్టీ ప్రముఖ లక్షం అని ఉపేంద్ర ప్రకటించారు.

గణపతి ప్రార్థనతో ఉపేంద్ర 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ'(కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ) కార్యక్రమం మొదలు పెట్టారు. మంగళవారం బెంగళూరు నగరంలోని గాంధీభవన్ లో తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన ఉపేంద్ర అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ప్రతిభావంతుల పార్టీ

ప్రతిభావంతుల పార్టీ

తన సినిమా బుద్దిమంతుడు అయితే పార్టీ ప్రజ్ఞావంత (ప్రతిభావంతులు) పార్టీ అని అన్నారు. కర్ణాటకలో ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని ఉపేంద్ర చెప్పారు. ప్రతి రంగంలో మార్పురావాలని ఉపేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

పోటీకి అభ్యర్థులు సిద్దం

పోటీకి అభ్యర్థులు సిద్దం


ఇప్పటికే 60, 70 శాసన సభ నియోజక వర్గాలకు పోటీ చెయ్యడానికి ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ'నుంచి అభ్యర్థులు సిద్దంగా ఉన్నారని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చెయ్యాలా ? వద్దా ? అనే అలోచనలో ఉన్నానని రియల్ స్టార్ ఉపేంద్ర వివరించారు.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

మీ సలహాలు, సూచనలు ఇవ్వండి, వాటితోనే తాను ఎన్నికల ప్రాచారం చేస్తానని, ప్రతి ఒక్కరూ తనకు సహకరిస్తారని ఆశిస్తున్నానని ఉపేంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర, ఆయన తల్లిదండ్రులు, సోదరుడు సుదీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అందరూ యూనీఫాం

అందరూ యూనీఫాం

ఉపేంద్రతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అభిమాన సంఘాల నాయకులు అందరూ ఖాకీ చొక్కాలు వేసుకుని కార్యక్రమానికి హాజరైనారు. కన్నడ రాజ్యోత్సవం (కర్ణాటక రాష్ట్ర అవిర్భావ దినోత్సవం) నవంబర్ 1వ తేదీ నిర్వహించక ఒక్క రోజు ముందే హీరో ఉపేంద్ర తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించారు.

అభిమానుల సందడి

అభిమానుల సందడి


బెంగళూరు నగరంలోని గాంధీభవన్ దగ్గర హీరో ఉపేంద్ర అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన హీరో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ పెట్టారని, తప్పకుండా మార్పు తీసుకువస్తారు అనే నమ్మకం ఉందని అన్నారు. కార్యక్రమానికి మామాలు దుస్తులు వేసుకుని వచ్చిన వారికి ఖాకీ చొక్కాలు పంపిణి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Upendra announces new politicial party Karnataka Prjnavanta Janata Party in Bengaluru Gandhi bhavan on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి