సుప్రీంలో ఓటమి, అనిత ఆత్మహత్య: కుటుంబ సభ్యులకు అండగా హీరో విజయ్, నేను ఉన్నాను !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: నీట్ కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసి సుప్రీం కోర్టులో కేసు ఓడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న తమిళనాడు దళిత విద్యార్థి అనిత కుటుంబ సభ్యులను ప్రముఖ తమిళ నటుడు విజయ్ పరామర్శించారు.

మీకు ఏ అవసరం వచ్చినా నన్ను కలవాలని, మీకు అండగా నేను ఉంటానని హీరో విజయ్ అనిత కటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తమిళనాడులోని అరియళూరులోని కుజమూర్ లోని అనిత కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న ఇంటికి సోమవారం హీరో విజయ్ వెళ్లారు.

Actor Vijay visits Anithas father and brother at Their residence Kuzhumur consolation

విజయ్ ని చూడగానే అనిత తండ్రి షణ్ముగం బోరున విలపించారు. హీరో విజయ్ అనిత తండ్రి షణ్ముగంను ఓదార్చుతూ నేల మీద కుర్చుని ఆయనకు ధైర్యం చెప్పారు. అనిత లేని లోటును తీర్చలేకపోయినా ఏ అవసరం వచ్చినా మీకు అండగా నేను ఉంటానని అనిత తండ్రి షణ్ముగం, ఆమె సోదరుడికి విజయ్ హామీ ఇచ్చారు.

Actor Vijay visits Anithas father and brother at Their residence Kuzhumur consolation

అర్థికంగా తాను అదుకుంటానని హీరో విజయ్ అనిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నీట్ పరీక్షలో ఫెయిల్ అయిన అనిత ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత వారం రోజుల నుంచి తమిళనాడులో అనిత కుటుంబ సభ్యులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Vijay went to Kuzhumur for consolate father and brother of Anitha, who killed herself for not getting medical seats even high marks scored at board exams because of NEET low marks.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి