రజనీకాంత్ కీలక వ్యాఖ్య, హీరో విశాల్‌పై దాడి (ఫోటో)
చెన్నై: హీరో విశాల్ పైన ప్రముఖ నటుడు శరత్ కుమార్ వర్గీయులు ఆదివారం నాడు దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే స్నేహితులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అందిస్తున్నారు.
నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తన పైన దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు. నడిగర్ సంఘం ఎన్నికలకు ఆదివారం అళ్వార్ పేటలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పోలింగ్ జరుగుతోంది. పలువురు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, నటి సంగీత మాట్లాడుతూ.. నటుడు శరత్ కుమార్ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు, శరత్ కుమార్ తన వైపుకు దూసుకొచ్చాడని చెప్పారు. అయితే, విశాల్, విక్రాంత్ తనకు అండగా నిలబడ్డారని చెప్పారు. ఈ సమయంలో విశాల్ పైన దాడి జరిగిందని తెలుస్తోంది.

మరోవైపు, నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. ఆదివారం ఉదయం ఓటు వేసేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమంతా ఓ కుటుంబమన్నారు. ఎన్నికలు, అందుకు సంబంధించిన ఆరోపణలు తాత్కాలికమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు చిత్ర ప్రముఖులు క్యూ కట్టడంతో తమ అభిమాన నటీ నటులను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications