బెంగళూరు స్వామీజీతో రాసలీలలు: కన్నడ ఖతర్నాక్ నటి ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని హుణసమారనహళ్ళి మద్దేవణాపుర జంగమ మఠంకు చెందిన దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీతో రాసలీలలు సాగించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటి గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది.

నిద్రమాత్రలు సేవించిన కన్నడ నటి కావ్యా ఆచార్య కర్ణాటకలోని శివమొగ్గలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని ప్రముఖ కన్నడ న్యూస్ చానల్ గురువారం వార్తలు ప్రసారం చేసింది. స్వామీజీ కళ్ల ముందే ఓ యువతి శరీరం మీద దుస్తులు మొత్తం తీసివేసి నగ్నంగా ఆయనతో రాసలీలలు జరిపిన వీడియో విడుదలై వైరల్ అయిన విషయం తెలిసిందే.

actress attempt to suicide who was involved in Scandal with Maddevanapura mutt sree

స్వామీజీతో రాసలీలలు జరిపింది కన్నడ నటి కావ్యా ఆచార్య అని ప్రచారం జరిగింది. స్వామీజీతో రాసలీలలు జరిపింది తాను కాదు అంటూ కావ్యా ఆచార్య ఓ టీవీ చానల్ కు ఇప్పటికే వివరణ ఇచ్చారు. స్వామీజీ రాసలీలల వివాదం జరుగుతున్న సందర్బంలోనే కావ్యా ఆచార్య నిద్రమాత్రలు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది.

బెంగళూరు శివార్లలో స్వామీజీతో రాసలీలలు జరపకుంటే కావ్యా ఆచార్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారని ఇప్పుడు కర్ణాటకలో జోరుగా చర్చ జరుగుతోంది. కావ్యా ఆచార్య ఆసుపత్రిలో కోలుకుంటున్నదని, అవమానంతో ఈ పని చేశారని ఆమె సోదరుడు క్రిష్ణ తనను కలిసిన మీడియాకు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress attempt to suicide who was involved in a sex scandal with Maddevanapura Mutt seer Dayananda Swamy. She admitted in Shivamogga private hospital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి