బెంగళూరు స్వామీజీతో రాసలీలలు: వీడియోలో ఉన్నది నేను కాదు: స్యాండిల్ వుడ్ ఖతర్నాక్ నటి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ముద్దేవనవర వీరసింహాసన సంస్థాన జంగమ మఠంలో దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ రాసలీలలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా నా పేరు ఎందుకు లాగుతున్నారు అంటూ స్యాండిల్ వుడ్ నటి కావ్యా ఆచార్య ప్రశ్నిస్తున్నారు.

దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ రాసలీలల వీడియో సోషల్ మీడియా, టీవీలల్లో వైరల్ అయ్యింది. స్వామీజీ రాసలీలల వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ స్యాండిల్ వుడ్ నటి ఎవరూ అని ఆరా తీశారు. స్వామీజీతో పాటు వీడియోలో ఉన్నది ఖతర్నాక్ కన్నడ సినిమాతో పాటు అనేక స్యాండిల్ వుడ్ సినిమాల్లో నటించిన నటి కావ్యా ఆచార్య అని ప్రచారం జరిగింది.

Actress denies charges her involvement in a sleazy act with Dayananda Swamiji

ఈ విషయంపై ఓ కన్నడ టీవీ చానల్ తో మాట్లాడిన కావ్యా ఆచార్య దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తనకు అసలు పరిచయం లేదని, ఏ స్వామీజీని తాను ఇంత వరకు కలవలేదని చెప్పింది. ఎవరో కావాలనే నా పేరు ప్రచారం చేస్తున్నారని కావ్యా ఆచార్య అన్నారు..

దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ ఉన్న వీడియోలో ఉన్నది నేను కాదని కావ్యా ఆచార్య వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇటీవల స్యాండిల్ వుడ్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కావ్యా ఆచార్య దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీతో పరిచయం పెంచుకున్నారని సమాచారం. ఇదే అవకాశంగా భావించిన ప్రత్యర్థులు సమయం చేసుకుని తెలివిగా స్వామీజీ రాసలలీల వీడియో తీశారని తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress named Kavya Acharya of Khatarnak Kannad film has denied charges her involvement in a sleazy act with Dayananda Swami alias Gurunajeshwara son of Muddevanavara Veera Simhasana Samsthan Mutt's seer Pattada Parvatharaja Shivacharya swamiji.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి