నటి నమితకు చేదు అనుభవం..గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారంటూ వీడియో..
నటి నమిత జెమిని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. టాలీవుడ్‌లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే, ఈ అమ్మడు తన కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే, తాజాగా నటి నమితకు ఆలయంలో చేదు అనుభవం ఎదురయ్యింది..
నేడు కృష్ణాష్టమి సందర్భంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన తనకు చేదు అనుభవం ఎదురయినట్లు స్వయంగా తన సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఎమోషనల్ వీడియో పోస్ట్ షేర్ చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన నమితను అక్కడి అధికారులు తనను అడ్డుకున్నారని నమిత వీడియోను విడుదల చేశారు, తనను, తన కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని ఆలయ సిబ్బంది వారిపై దురుసుగా, అహంకారంగా ప్రవర్తించారని నటి నమిత వీడియోలో పేర్కొన్నారు. తాను పుట్టుకతో హిందువునని, తనపై అగౌరవంగా ప్రవర్తించిన ఆలయ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని నమిత డిమాండ్ చేశారు. అయితే, ఈ ఘటన తనను ఎంతోగానో బాధకు గురిచేసిందని నమిత షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు కొందరు నెటిజన్లు మాత్రం క్షమించమని అడిగారు.













Click it and Unblock the Notifications