బహుబాష నటి సింధు మెనెన్ తల్లికి తీవ్రగాయాలు: రోడ్డు మీదే వదిలేసిన బెంగళూరు పోలీసులు !

బహుబాష నటి సింధు మెనెన్ తల్లి శ్రీదేవికి రోడ్డు ప్రమాదంలో తీవ్రయాలైనాయి. ప్రమాదం జరిగి గంట అయినా ఆమె నడిరోడ్డు మీదే సహాయం కోసం ఎదురు చూసినా స్థానికులు కాని, అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు .

బెంగళూరు: బహుబాష నటి సింధు మెనెన్ తల్లి శ్రీదేవికి రోడ్డు ప్రమాదంలో తీవ్రయాలైనాయి. ప్రమాదం జరిగి గంట అయినా ఆమె నడిరోడ్డు మీదే సహాయం కోసం ఎదురు చూసినా స్థానికులు కాని, అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కాని పట్టించుకోలేదని వెలుగు చూసింది.

చివరికి సింధు మెనెన్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె తల్లి శ్రీదేవిని ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులోని మత్తికెరె సమీపంలోని ఎంఎస్. రామయ్య ఆసుపత్రి నుంచి నటి సింధు మెనెన్ తల్లి ఆటోలో మల్లేశ్వరంలోని ఇంటికి బయలుదేరారు.

Actress Sindhu Menon's mother Sridevi was injured in an accident in Bengaluru

మార్గం మధ్యలో యశవంతపురం సిగ్నల్ సమీపంలో సింధు మెనెన్ తల్లి శ్రీదేవి వెలుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొనింది. తీవ్రగాయాలైన శ్రీదేవి రోడ్డు మీద నిలబడి సహాయం చెయ్యండి అంటూ సింధు మెనెన్ తల్లి శ్రీదేవి వేడుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు.

ట్రాఫిక్ సిగ్నల్ లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రమాదం ఎలా జరిగింది, ఎవరు నియమాలు ఉల్లంఘించారు అంటూ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రశ్నలు వేశారే కాని శ్రీదేవిని ఆసుపత్రికి తరలించలేదని వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న సింధు మెనెన్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. యశవంతపురం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+