మహాకుంభ్ సేవలో అదానీ గ్రూప్..ఇస్కాన్‌తో జతకట్టి మహాప్రసాదం పంపిణీ..!

జనవరి 13వ తేదీ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లో మహాకుంభ మేళ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మహాకుంభ మేళ ఉండటంలో పలు రైళ్లను అటువైపుగా దారి మళ్లించింది భారతీయ రైల్వేస్. ఇక అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్నీ సవ్యంగా సాగేలా పలు సంస్థలు ముందుకొచ్చి తమవంతు సహాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అదానీ సంస్థ ఇస్కాన్‌తో జతకట్టి మహాకుంభ మేళకు వచ్చే భక్తులకు ఆహారం అందజేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు ఆకలి తీర్చేందుకు ఆహారం పంపిణీ చేయాలని ఆలోచన చేసి ముందుకొచ్చిన ఇస్కాన్ సంస్థతో జతకట్టేందుకు అదానీ సంస్థ నిర్ణయించింది.ఈ మేరకు అదాని గ్రూప్ ఛైర్మెన్ గౌతం అదానీ గురువారం రోజున ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషన్ (GBC) ఛైర్మెన్‌ గురుప్రసాద్ స్వామి వారిని కలిశారు. ఇంత మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు గురుప్రసాద్ స్వామివారికి గౌతం అదానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో తమ వంతు సహాయం చేస్తామని అదానీ విన్నవించారు.

Adani-ISKCON Collaboration to Serve Mahaprasad at Maha Kumbh Mela 2025

మహాప్రసాదం సేవలో తమ వంతు సహాయం చేస్తామని అదానీ అన్నారు. భక్తులకు సేవ చేసేందుకు మహాకుంభ మేళ సరైన వేదికగా నిలుస్తుందని అదానీ పేర్కొన్నారు. ప్రతి భక్తుడు భగవంతునికి సేవ చేసేందుకే ఇక్కడకు వస్తారని చెప్పారు. మహాప్రసాద సేవ చేసేందుకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్‌తో జతకడుతున్నామన్నారు. అన్నపూర్ణ దేవీ ఆశీస్సులతో కొన్ని లక్షల మంది భక్తులకు ఆహారాన్ని అందజేస్తామని చెప్పారు.


గురువారం రోజున తాను ఇస్కాన్ సంస్థ ఛైర్మెన్ గురుప్రసాద్‌ స్వామివారిని కలిసినట్టు చెప్పిన అదానీ... వారు చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. సేవ పట్ల తమకున్న శ్రద్ధ ఎలాంటిదో మంచి అనుభూతి పొందినట్లు అదానీ వెల్లడించారు. భక్తిని చాటడంలో సేవ ముఖ్య భూమిక పోషిస్తుందని,సేవ అంటే ధ్యానమని, సేవ అంటే ప్రార్థన, సేవ అంటే భగవంతుడని అదానీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కార్పొరేట్ రంగంలో సమాజ సేవ, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించడంలో అదానీ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఇస్కాన్ ఛైర్మెన్ గరుప్రసాద్ స్వామీజీ అన్నారు. అదానీలో మానవీయ కోణం ఉందని, ఒకరు చెప్పే వరకు ఆగరని, నిస్వార్థమైన సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. తాను ఈ మహత్తర కార్యక్రమంలో తమతో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపినందుకు అదానీకి ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవకై అదానీ చేస్తున్న ప్రయత్నం ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.

మహాకుంభ మేళ జరిగే పరిసర ప్రాంతాల్లో 50 లక్షల మంది భక్తులకు సరిపడా భోజనం తయారు చేయడం జరుగుతుంది. ఇందుకోసం రెండు వంటశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహాప్రసాదంను 40 స్థలాల్లో పంపిణీ చేస్తారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2500 మంది వాలంటీర్లు పనిచేస్తారు. దివ్యాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.ఇక భక్తులకు 5 లక్షల గీతా సార్‌ను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఇస్కాన్ - అదానీ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+