Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భూటాన్ తో అదానీ పవర్ ఒప్పందం-6 వేల కోట్ల డీల్..!

భారత ఉపఖండ దేశం భూటాన్ కు ఇంధన భద్రత, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలే లక్ష్యంగా 6 వేల కోట్లతో అదానీ పవర్ చేపట్టనున్న జల విద్యుత్ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. 570 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అదానీ పవర్ తో పాటు భూటాన్ కు చెందిన డ్రంక్ గ్రీన్ పవర్ కార్పోరేషన్ ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందంపై ఇరు సంస్థలూ సంతకాలు చేశాయి.

భారత్ లో అతి పెద్ద ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్ద అయిన అదానీ పవర్.. భూటాన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ డ్రంక్ గ్రీన్ పవర్ కార్పోరేషన్ తో కలిసి వాంగ్చూ వద్ద ఈ మెగా ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఇందుకోసం ఓ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపైనా ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. భూటాన్ రాజ్యంతోనూ కన్సెషన్ అగ్రిమెంట్ పైనా అదానీ పవర్ సంతకాలు చేసింది. భూటాన్ ప్రధాని డాసూ త్సేరింగ్ టోబ్గే, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ఇరు వైపుల నుంచీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Adani Power Druk Green Power Ink 6 000 Crore Deal for 570MW Hydropower Project in Bhutan

ఈ మెగా జల విద్యుత్ ప్రాజెక్టును బూట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ (బూట్ ) విధానంలో చేపడతారు. ప్రత్యామ్నాయ ఇంధన ప్లాంట్ నిర్మాణంతో పాటు దానికి అవసరమైన మౌలిక సదుపాయాల్ని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తారు. ఇప్పటికే డీపీఆర్ దశ దాటిన ఈ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో ప్రారంభం కానుంది. ఐదేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సుస్థిర అభివృద్ధిలో భూటాన్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అని, ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ద్వారా దేశ సహజ వనరుల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని అదానీ పవర్ సీఈవో ఎస్బీ ఖ్యాలియా తెలిపారు. వాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్టు భూటాన్ గరిష్ట శీతాకాల డిమాండ్‌ను చాలావరకు తీరుస్తుందన్నారు. ఆ సమయంలో జల విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంటుందని, వేసవి నెలల్లో ఇది భారతదేశానికి విద్యుత్‌ను ఎగుమతి చేస్తుందని తెలిపారు.

Adani Power Druk Green Power Ink 6 000 Crore Deal for 570MW Hydropower Project in Bhutan

1960ల నుంచీ భారత్-భూటాన్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి కలిసి పనిచేశాయని, ఇది రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని డీజీపీసీ ఎండీ దాషో చెవాంగ్ రింజిన్ తెలిపారు. భూటాన్ 2040 నాటికి మరో 15వేల మెగా వాట్ల జలవిద్యుత్ , 5వేల మెగా వాట్ల సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించాలని యోచిస్తోందన్నారు. అందువల్ల 570 మెగా వాట్ల వాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్టును స్థాపించడానికి అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. వారి సాంకేతిక & ఆర్థిక బలం మరియు అదానీ గ్రూప్ తీసుకువచ్చే అపారమైన అనుభవం మరియు నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని, ఇలాంటి ప్రాజెక్టులకు ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక నడిపించడంలో సాయపడటమే కాకుండా భూటాన్ ఇంధన భద్రతతో పాటు ఇరుదేశాల గ్రిడ్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+