వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Adani Power:దుమ్మురేపిన షేర్లు : లాభాల బాటలో..ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి..?

|
Google Oneindia TeluguNews

అదానీ పవర్స్‌లో షేర్లు కొన్న వారికి గుడ్ న్యూస్. అదానీ పవర్ షేర్లు ఒక్కసారిగా అంటే ఏకంగా 70శాతం మేరా లాభాల బాట పయనించాయి. అదానీ గ్రూప్‌ స్టాక్స్ జూన్ 3వ తేదీన రూ.97.35తో ముగియగా... బుధవారం అంటే జూన్ 9వ తేదీకి రూ 166.90తో ప్రారంభమైంది. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపు 70శాతం లాభం వచ్చింది. అయితే ఒక్కసారిగా ఈ పవర్ షేర్లు ఆకాశాన్ని తాకడం వెనక రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

Recommended Video

Why CitiBank Is Selling Its India Business కొనుగోలు చేసేందుకు దిగ్గజ బ్యాంకులు || Oneindia Telugu
 ప్రభుత్వాలు డబ్బులు చెల్లించడంతో..

ప్రభుత్వాలు డబ్బులు చెల్లించడంతో..

అదానీ పవర్‌కు సంబంధించి గ్రీన్ ఎనర్జీ కొనుగోలు మరియు చెల్లింపులు ప్రక్రియ జరిగింది. అదానీ పవర్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు కొంత కాలంగా డబ్బులు చెల్లించలేదు. అయితే అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడంతో షేర్ ధర కూడా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అదానీ పవర్‌ను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కూడా రద్దు కావడంతో అదానీ పవర్ షేర్లు ర్యాలీ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

 విద్యుత్ వాహనాల వైపు మొగ్గు

విద్యుత్ వాహనాల వైపు మొగ్గు

ఇక పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు విద్యుత్‌తో నడిచే వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారని ఇది గ్రహించిన అదానీ సంస్థ గ్రీన్ ఎనర్జీ వైపు ఫోకస్ చేసి అందులో పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. దీంతో మంచి లాభాలను చవి చూసిందని నిపుణులు చెప్పారు. అయితే దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం లాభపడ్డారని చెప్పుకొచ్చారు. దీనికి తోడు రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పాక్షికంగా బిల్లులను చెల్లించడంతో అదాని పవర్ షేర్లు లాభాల బాట పట్టాయని వివరించారు. పాక్షికంగా అయినా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడంతో కొంతమేరకు అదానీ తన అప్పులను పూడ్చగలిగిందని నిపుణులు చెప్పారు.

 ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి

ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి

ఇక అదానీ పవర్ షేర్లు లాభాల బాట పట్టడానికి కొన్ని సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు వివరించారు. గత నాలుగు రోజుల్లో 70శాతం మేరా లాభాలు వచ్చాయని చెప్పారు. రూ.100 వద్ద ప్రారంభమైన ర్యాలీ క్రమంగా రూ.150 మార్కును టచ్ చేసి కొత్త రికార్డు సృష్టించిందని చెప్పారు. అయితే ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేశారో వారు మాత్రం రూ.185 నుంచి రూ.190 మధ్య లాభం వచ్చినప్పుడు వెంటనే అమ్మకానికి పెట్టొచ్చని సూచిస్తున్నారు. ఇక అదానీ షేర్లను కొనుగోలు చేయాలనుకునేవారు రూ.120 నుంచి రూ.150 మధ్య ఉన్నప్పుడు షేర్లను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంగా ఉంచాలని కూడా రికమెండ్ చేస్తున్నారు. మరో 6-8 నెలల్లో అదానీ పవర్ షేర్ ధర రూ. 255 మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

English summary
Adani Power share had made a profit of 70percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X