'ఆపరేషన్ సింధూర్' లో అదానీ గ్రూప్ కీలక పాత్ర.. త్రివిధ దళాలపై అదానీ ప్రశంసలు
భారత త్రివిధ దళాలపై ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ లో సైనికుల పోరాట ప్రతిమను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులను భారత్ సమర్థవంతంగా తట్టుకుందన్నారు. ఈ మేరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ విస్తరణ ప్రణాళికలు, భారత్ అభివృద్ధి, పురోగతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో దేశ సైనికులకు అదానీ నివాళులు అర్పించారు. భారత్ లో ఇటీవల జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. అలాగే అదానీ గ్రూప్ పనితీరును ఆయన ప్రశంసించారు. సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు. ఈ మేరకు అదానీ ప్రసంగిస్తూ భారత్ కు శాంతి విలువ తెలుసని.. కానీ సవాళ్లు విసిరితే తన సామర్థ్యంతో ఎలా బదులివ్వాలో కూడా తెలుసని స్పష్టం చేశారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై నివాళులు అర్పిస్తున్నట్లు అదానీ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ఎన్నికల గోలలు, ఉద్రిక్తతలు, సంఘర్షణలు జరిగాయి. దిగుమతులు, ఎగుమతుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాటిని భారత్ తట్టుకుని నిలబడింది. ఆర్థిక ప్రగతిని సాధించింది. సవాళ్లను అధిగమించి దూరదృష్టితో వ్యవహరించింది. కేంద్రంతోపాటు రాష్ట్రాల్లోనూ పాలసీలపై తీసుకున్న నిర్ణయాలతో ఇది సాధ్యం అని అదానీ పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్.. అదానీ గ్రీన్ ఎనర్జీపై పలు ఆరోపణలు చేసిందని అదానీ అన్నారు. కానీ అదానీ గ్రూప్ ఎప్పుడూ ప్రపంచ గవర్నెన్స్, విధివిధానాలకు కట్టుబడి ఉంటుందని ఆయన పునురుద్ఘాటించారు. ఎన్నో సవాళ్లు ఉన్నా అదానీ గ్రూప్ ఆర్థిక వృద్ధిని సాధించిందన్నారు. FY25 లో గ్రూప్ రాబడి రూ. 2,71,664 కోట్లకు పెరిగిందన్నారు. సవాళ్లు, సమస్యలను అధిగమించి ఎన్నో భావి కంపెనీలకు అదానీ స్ఫూర్తిగా నిలిచిందని అదానీ పేర్కొన్నారు.
రంగాలవారీగా చూస్తే..
విద్యుత్ ఉత్పత్తిలో అదానీ పవర్.. రికార్డు సృష్టించింది. 100 బిలియన్ యూనిట్స్ విద్యుత్తు ఉత్పత్తిని దాటేసింది. 2030 నాటికి 31 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా ముందుకెళ్తోంది అదానీ గ్రూప్. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్కును కావ్ డా లో నిర్మించతలపెట్టింది అదానీ గ్రీన్. 2030 నాటికి 50 గిగావాట్స్ లక్ష్యంగా ఈ పార్కును ఏర్పాటు చేశారు. అయితే థర్మల్, హైడ్రో, రెన్యువబుల్ కలిపి 2030 నాటికి 100 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ. 44,000 కోట్ల ట్రాన్స్ మిషన్ ఆర్డర్ లను పొందింది. అంతేకాక రూ. 13,600 కోట్ల స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్ట్ లను ప్రస్తుతం అమలు చేస్తోంది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ FY26 నాటికి 10 GW ఇంటి గ్రేటెడ్ సోలార్ మాడ్యూల్ సదుపాయాన్ని కలిగి ఉండబోతోంది. అదానీ పోర్ట్స్ రికార్డు స్థాయిలో 450 MMT కార్గో సేవలను పూర్తిచేసింది. అంతేకాక పీఎం గతి శక్తి మిషన్ తో భాగస్వామ్యం జరిపి ఇంటి గ్రేటెడ్ రవాణా యుటిలిటీని నిర్మిస్తోంది.
నేచురల్ రిసోర్సెస్ విషయానికొస్తే 47 మిలియన్ టన్నుల బొగ్గు, ఇనుప ఖనిజం ఉత్పత్తిని సాధించింది. అలాగే FY26 నాటికి 30 శాతం కంటే ఎక్కువ వృద్ధిని సాధించేందుకు లక్ష్యం పెట్టుకుంది. అదానీ సిమెంట్ లో ఇప్పటికే 100 MTPA సామర్థ్యాన్ని అధిగమించింది. ఈ మేరకు లక్ష్యాన్ని అధిగమించి 72 శాతం వరకు వృద్ధి సాధించింది.
అదానీ ఎయిర్‌పోర్ట్స్ 94 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఈ సంవత్సరం చివరలో ప్రారంభమయ్యే నేవీ ముంబై విమానాశ్రయంలో విమానాల టెస్టింగ్ సైతం పూర్తి చేసింది. అదానీ డిఫెన్స్ విషయానికి వస్తే డ్రోన్లు, యాంటీ- డ్రోన్ సిస్టమ్స్ ఆపరేషన్ సింధూర్ లో సైనికులకు ఉపయోగపడ్డాయి. పునరుత్పాదక శక్తితో నడిచే అదానీ డేటా సెంటర్స్ భారత్ అంతటా విస్తరిస్తున్నాయి. అదానీ టోటల్ గ్యాస్ ఇప్పుడు 1 మిలియన్ PNG వినియోగదారులకు సేవలు అందిస్తోంది. 22 రాష్ట్రాల్లో 3,400 EV ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తోంది.
ధారావి అభివృద్ధి ప్రాజెక్ట్ లో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద మురికివాడను ఒక మోడల్ టౌన్‌షిప్ గా మార్చేందుకు అదానీ గ్రూప్ ముందుకెళ్తోంది. ఈ విధానం వల్ల 10 లక్షల మందికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఇక అదానీ గ్రూప్ రాబోయే ఐదేళ్లలో ఏటా $15-20 బిలియన్లు CAPEX (మూలధన వ్యయం) పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. ఇవి కేవలం గ్రూప్ లో మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశ మౌలిక సదుపాయాలు, అవకాశాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

అదానీ హెల్త్‌కేర్ టెంపుల్స్ లో భాగంగా అహ్మదాబాద్, ముంబైలో 1,000 పడకల క్యాంపస్ లను మేయో క్లినిక్ అనే సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నామని అదానీ తెలిపారు.
ముంద్రాలో రూ. 2,000 కోట్ల స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని అన్నారు. ITEES సింగపూర్, IGCC భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ శిక్షణ, ధృవీకరణ ఉంటుందని అన్నారు. మహా కుంభమేళాలో లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం పంపిణీ చేశామని.. ISKCON భాగస్వామ్యంతో 5,000 మందికి పైగా ఆదానీ ఉద్యోగులు మహాప్రసాద సేవలో స్వచ్ఛందంగా పనిచేశారని అదానీ చెప్పుకొచ్చారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ఆదానీ గ్రూప్ చరిత్ర వారసత్వంతో రూపు దిద్దుకోలేదని నమ్మకం, దేశానికి సేవ చేయడం, విశ్వాసంతో రూపు దిద్దుకుందన్నారు. ఒక దేశం భవిష్యత్తు పాలసీ ఒప్పందాలలో ఉండదని.. ఎంట్రి ప్రూనర్ లు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయంలో ఉంటుందని అన్నారు. ఈ మేరకు అదానీ గ్రూప్ నకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఛాప్టర్స్ భవిష్యత్తులో ఇంకా రావాల్సి ఉందని గౌతమ్ అదానీ పునరుద్ఘాటించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications