ప్రధాని నరేంద్ర మోడీ చేతికి చేరిన రాజదండం ‘సెంగోల్’
న్యూఢిల్లీ: భారత నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి గంటల ముందుగానే దేశ రాజధానికి చేరుకుంది చారిత్రక రాజదండం(సెంగోల్). పలువురు అధీనం మఠాదిపతులు, పూజారులు చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకుని శనివారంప్రధాని నరేంద్ర మోడీకి 'సెంగోల్'ను అందజేశారు. ఆదివారం (మే 28) కొత్త పార్లమెంటు భవనం అధికారికంగా ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ పరిణామం జరిగింది.
శనివారం సాయంత్రం అధీనం పూజారులు ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మదురై ఆధీనం 293వ ప్రధాన పూజారి ప్రధాని మోడీకి సెంగోల్‌ను బహూకరించారు. తిరువడుతురై ఆధీనం చెన్నై నుంచి మే 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం మోడీకి సెంగోల్ బహూకరించారు. మఠాధిపతులను సత్కరిస్తూనే మోడీ వారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రాజదండం స్వేచ్ఛకు చిహ్నమని వ్యాఖ్యానించారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. తమిళ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు అపురూపమని ప్రధాని వ్యాఖ్యానించారు. చారిత్రక సెంగోల్‌కు సరైన ప్రాధాన్యత దక్కిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
VIDEO | Several Adheenam priests handed over the Sengol to PM Modi ahead of the inauguration of the new Parliament building on Sunday. pic.twitter.com/gr3d0hggtl
— Press Trust of India (@PTI_News) May 27, 2023
కాగా, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ.. స్పీకర్ సీటు దగ్గర 'సెంగోల్' (రాజదండం) ఉంచుతారు. 14 ఆగస్టు, 1947న, జవహర్‌లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ సెంగోల్‌ను అందుకున్నారు. ఇది బ్రిటీష్ వారి చేతుల నుంచి అధికార మార్పిడికి చిహ్నంగా అభివర్ణించారు. అప్పటి మద్రాసులో సుప్రసిద్ధ నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్‌ను రూపొందించారు. అద్భుతమైన రాజదండం సుమారు ఐదు అడుగుల పొడవు, పైభాగంలో ఒక ఎద్దు చెక్కబడి ఉంటుంది.
#WATCH | Delhi | Ahead of the inauguration ceremony of #NewParliamentBuilding, PM Narendra Modi meets the Adheenams at his residence and takes their blessings. The Adheenams handover the #Sengol to the Prime Minister pic.twitter.com/Vvnzhidk24
— ANI (@ANI) May 27, 2023
కాగా, ఆదివారం ఉదయం 8:30, 9:00 గంటల మధ్య కొత్త పార్లమెంట్‌లోని లోక్‌సభ ఛాంబర్‌లో సెంగోల్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడు గర్వించేలా చేస్తుందని పేర్కొన్న ప్రధాని మోడీ.. కొత్త కాంప్లెక్స్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.












Click it and Unblock the Notifications