జనగణమన నుంచి అధినాయక తొలగించాలి: గవర్నర్
జైపూర్: జాతీయ గీతమైన 'జన గణ మన'లో 'అధినాయక' పదాన్ని తొలగించాలని రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యానించారు. జన గణ మన నుంచి అధినాయకను తొలగించి దాని స్థానంలో మంగళ్‌ను చేర్చాలని సూచించారు.
మంగళవారం రాజస్థా న్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. అధినాయక్ పదం బ్రిటీష్ కాలంలో ఆంగ్లేయులను ప్రభువు అని కీర్తించేందుకు ఉపయోగించేవారన్నారు. ప్రస్తుతం ఎవరిని ఉద్దేశించి ప్రభువులు అంటున్నారని ప్రశ్నించారు.

జన గణ మన అధినాయక్ జయహేలో అధినాయక్ స్థానంలో మంగళ్ చేర్చి జన గణ మన మంగళ్ గాయే అని పాడాలని సూచించారు. విశ్వకవి ఠాగూర్ అంటే తనకు పూర్తి గౌరవముందని, కానీ జాతీయగీతంలో అధినాయక్ పదాన్ని తొలగించాలన్నారు.
గవర్నర్‌ను సంభోదించేటప్పుడు మహాహమిమ్ లేదా హిజ్/హర్ ఎక్సెలెన్సీ అని పేర్కొనడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. దానిని బ్రిటిష్ కాలం నుండి ఉపయోగిస్తున్నామన్నారు. మహారాణా ప్రతాప్ స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఆయన జీవన పోరాటాన్న వివరించే కోర్సులను విద్యాశాఖ నిర్వహించాలన్నారు. ఔరంగజేబు గొప్పవాడు కాదని, శివాజీ గొప్పవాడు అన్నారు.
కాగా, జాతీయ గీతంలో అరవై ఏడేళ్లుగా అధినాయక పదం ఉందని, దానిని ఇప్పుడు తొలగించాల్సిన అవసరం లదని త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ అన్నారు. అధినాయక అనే పదం బ్రిటిష్ ప్రభుత్వ అధిపతిని స్తుతించేది కాదని తాను భావిస్తున్నానని చెప్పారు. జాతీయ గీతంలో మార్పులు కోరడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications