Aditya L1 ట్రాకింగ్: సూర్యుడి వైపు దూసుకెళ్లే క్రమంలో..మరో ఎర్త్‌బౌండ్ ఫైరింగ్
బెంగళూరు: సూర్యుడిపై సరికొత్త ప్రయోగాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1పై ప్రయాణానికి సంబంధించిన మరో కీలక సమాచారం వెలువడింది. ప్రస్తుతం భూ కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం అనంతరం దాని భూకక్ష్యను మార్చడం ఇదే నాలుగోసారి.
అర్ధరాత్రి దాటిన తరువాత 2: 15 నిమిషాల సమయంలో మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో కక్ష్యను మార్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని పనితీరు సంతృప్తికరంగా ఉందని, ప్రయాణం సజావుగా సాగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 భూమికి 256 x 1,21,973 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది.

ఈ నెల 19వ తేదీన మరోసారి కక్ష్యను మార్చుతుంది ఇస్రో అదే చివరిది అవ్వొచ్చు. ఆదిత్య ఎల్1 భూమి చుట్టూ పరిభ్రమిస్తూ.. క్రమంగా తన కక్ష్యను మార్చుకుంటూ సూర్యుడి దిశగా దూసుకెళ్తుంది. ఈ ఉపగ్రహం భూకక్ష్యలోనే ఇంకో 16 రోజుల పాటు సంచరిస్తుంది. లాగ్రాంజ్ పాయింట్ 1లో ప్రవేశపెట్టడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కనీసం అయిదుసార్లు ఈ శాటిలైట్ కక్ష్యను మార్చాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు మూడుసార్లు దాని కక్ష్యను బదలాయించారు. 3, 5, 10వ తేదీల్లో అవి విజయవంతంగా ముగిశాయి. చివరిదైన అయిదో ఎర్త్ బౌండ్ ఫైరింగ్ ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటలకు షెడ్యూల్ చేశారు. దీని తరువాత భూకక్ష్యకు అవతలి వైపునకు వెళ్తుంది ఆదిత్య ఎల్1.
బెంగళూరు, మారిషస్, శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌లు ఉపగ్రహాన్ని విజయవంతంగా ట్రాక్ చేస్తోన్నాయి. ఈ స్టేషన్‌లతో ఆదిత్య-L1 కోసం ఫిజీ ఐలండ్స్‌లో గల పోస్ట్-బర్న్ టెర్మినల్ నుంచీ ఆపరేషన్‌లను నిర్వహిస్తోన్నట్లు ఇస్రో తెలిపింది. 125 రోజుల ప్రయాణం తరువాత ఎల్1 పాయింట్‌కు చేరుకుంటుంది. అప్పటినుంచి సూర్యుడిపై అధ్యయనం చేయడం మొదలుపెడుతుంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications