నౌకాదళానికి కొత్త చీఫ్..!
న్యూఢిల్లీ: నౌకాదళాధిపతిగా నియమితులైన అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ బాధ్యతలను స్వీకరించారు. నౌకాదళానికి ఆయన 24వ అధిపతి. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలోని సౌత్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లాంఛనంగా బాధ్యతలను చేపట్టారు. నౌకాదళ మాజీ అధిపతి సునీల్ లంబా చేతుల మీదుగా ఆయన బాధ్యతలను అందుకున్నారు.

బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా నౌకాదళం ప్రధాన కార్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు నౌకాదళ తూర్పు ప్రాంత ఫ్లీట్ కమాండర్‌గా వైస్ అడ్మిరల్‌గా అతుల్ కుమార్ గురువారమే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా మరో వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ కూడా బాధ్యతలను చేపట్టారు.












Click it and Unblock the Notifications