Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ ఓట్ల తేడా 6 లక్షలు-టాప్ లో ఏపీ..! షాకింగ్ రిపోర్ట్..!

దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడి ప్రభుత్వాల ఏర్పాటు కూడా పూర్తయిపోయినా దీనిపై అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఏడు దశల్లో సాగిన ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే దశల వారీగా ఓట్ల శాతం వెల్లడించేందుకు ఈసీ అప్పట్లో నిరాకరించడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇవి కాస్తా చినికి చినికి గాలివానగా మారి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. అయితే సుప్రీంకోర్టు దీనిపై తదుపరి విచారణకు సిద్దంగా లేకపోవడంతో అప్పటికి సద్దుమణిగింది.

కానీ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఎన్నికల ఓట్ల శాతాలు వెల్లడించాల్సిందేనని పోరాటం చేసిన స్వచ్చంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ మాత్రం దీన్ని వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాల్ని, కౌంటింగ్ చేసిన ఓట్ల శాతాల్ని పోలుస్తూ డేటా విడుదల చేసింది. దీని ప్రకారం పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య దాదాపు 6 లక్షల ఓట్ల తేడా ఉందని తేల్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వస్తోంది.

ADR report says 6 lakh votes difference between polled and counted votes of lok sabha election

దేశంలో 362 నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదు చేసిన ఓట్లలో చాలా వరకూ లెక్కించలేదని ఏడీఆర్ ఆరోపించింది. దీంతో పోలింగ్, కౌంటింగ్ మధ్య ఓట్ల తేడా 5.5 లక్షలకు పైగా ఉందని చెబుతోంది. 176 సీట్లలో ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్ల కంటే దాదాపు 35,000 ఓట్లు ఎక్కువగా లెక్కించినట్లు ఏడీఆర్ పేర్కొంది. 538 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉందని ఎన్నికల సంఘం సొంత గణాంకాలు చెబుతున్నాయని ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగ్‌దీప్ చోకర్ తాజాగా ఎన్టీటీవీకి తెలిపారు. దీనిపై ఈసీ స్పందించాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేశారు.

మరోవైపు ఏడీఆర్ విడుదల చేసిన పోలింగ్, కౌంటింగ్ ఓట్ల తేడా గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ 85777 ఓట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత రెండో స్ధానంలో ఒడిశా 63123 ఓట్ల తేడా కలిగి ఉంది. 53 వేల ఓట్ల తేడాతో మూడో స్దానంలో యూపీ, 51 వేల ఓట్ల తేడాతో నాలుగో స్ధానంలో తమిళనాడు ఉన్నాయి. అసోం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ 30 వేల ఓట్లకు పైగా తేడా సూచిస్తున్నాయి. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ పోలింగ్, కౌంటింగ్ మధ్య 14 వేల 969 ఓట్ల తేడా వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+