టి బిల్లు పాస్ అవుతుంది: అద్వానీ, భద్రాచలం మినహా..

భద్రాచలం మినహా...
సవరణల పైన బిజెపి, కాంగ్రెసు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం మినహా మిగిలిన రెవెన్యూ డివిజన్‌ను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అలాగే భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, భారీ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు అంగీకరించింది.
రెండు రాష్ట్రాల్లో ఆర్థిక ప్రోత్సాహకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ తరహాలో సీమాంధ్రలో పన్ను మినహాయింపు ఇవ్వడమే కాకుండా బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీని ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వీటిపై ప్రకటన చేయనున్నారు.
అటార్నీ జనరల్‌ను పిలువాలని సుజనా
బిల్లుపై సందేహాలను నివృత్తి చేయడానికి అటార్నీ జనరల్‌ను రాజ్యసభకు పిలిపించాలని టిడిపి సీమాంధ్ర ఎంపి సుజనా చౌదరి నోటీసు ఇచ్చారు. బిల్లులో ఉన్న రాజ్యంగ, న్యాయపరమైన చిక్కులను సభలోని సభ్యులకు ఆటార్నీ జనరల్ వివరించాలని సుజానా చౌదరి నోటీసులో పేర్కొన్నారు.
బిల్లు ఖాయం: విహెచ్
రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని కాంగ్రెస్ వి హనుమంత రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజలు పోరాటం, 1100మంది విద్యార్ధుల బలిదానాల తరువాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని తెలిపారు. బిజెపి సవరణలన్నీ కాంగ్రెస్ అంగీకరించిందని వారి మద్దతుతో రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications