షాకింగ్ వీడియో: అమెరికాలో ఇంత ఘోరమా.. ఆ ఒక్క కారణంతో.. 17 ఏళ్ల తర్వాత తట్టాబుట్టా సర్దుకుని భారత్ కు..

అమెరికా వెళ్లాలని చాలామంది యువతీ యువకులకు కోరికగా ఉంటుంది. ఉపాధి, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది భారతీయులు అగ్రరాజ్యానికి పయనం అవుతుంటారు. వీరిలో అత్యధిక శాతం మధ్య తరగతి వాళ్లే ఎక్కువగా ఉంటారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి ఉన్నతంగా స్థిరపడాలని కోరుకుంటారు. ఇక ప్రస్తుతం అమెరికాలో భారతీయులు దాదాపు 5.4 మిలియన్ల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా జనాభాలో సుమారు 1.6 శాతంగా చెప్పొచ్చు. అయితే తాజాగా ఓ షాకింగ్ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే..

ఆ దంపతులు 17 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అయితే తాజాగా తట్టాబుట్టా సర్దుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. ఇక అక్కడ ఉండలేమని చెప్పారు. అమెరికా హెల్త్ కేర్ వ్యవస్థ చాలా ఖరీదుగా మారిందని.. భారత్ లోని వైద్య వ్యవస్థతో పోల్చితే అమెరికాలో వైద్యం చాలా డబ్బుతో కూడుకున్నదని అందువల్ల తాము భారత్ కు తిరిగివచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ జంట మాట్లాడుతూ.. తమకు కవల పిల్లలు ఉన్నారని.. అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థ కారణంగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఇన్‌ స్టా వీడియోలో తెలిపారు. బీమా ఖర్చులు సైతం చాలా ఎక్కువగా ఉండటంతోపాటు, హెల్త్ సేవలను పొందడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

After 17 Years in America Couple Returns to India Treatment Was Too Expensive

"మాకు అమెరికాలో బీమా సౌకర్యం పొందేందుకు నెలవారీ ప్రీమియంలకు అదనంగా 14,000 డాలర్లు అవుట్-ఆఫ్-పాకెట్ ఖర్చులు వచ్చేవి. కేవలం మా ఇద్దరి కోసం మేము అడిగిన అత్యంత చవకైన ప్లాన్ నెలకు 1,600 డాలర్లు.. దీనికి 15,000 డాలర్లు డిడక్టిబుల్ ఉండేది. ఇందులో మా ఇద్దరు పిల్లన్ని కూడా చేర్చలేదు. కానీ భారీగా ఖర్చు అయ్యేది. దీంతో పిల్లలకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మాకు ఖరీదైనవిగా అనిపించేవి.. ఒత్తిడిగా ఉండేది" అని ఈ ఎన్ఆర్ఐ కపుల్ తమ ఆవేదన వెల్లడించారు. ఈ క్రమంలోనే తిరిగి భారత్ కు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ జంట పేర్కొంది. భారత్ కు రావడం కారణంగా తమకు మానసిక ప్రశాంతత దొరికిందన్నారు.

అమెరికాతో పోల్చితే భారత్ లో వైద్య ఖర్చులు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ఇక్కడా మంచి డాక్టర్లు, వైద్య సౌకర్యం ఉందని వివరించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోను 1.6 మిలియన్ మంది వీక్షించారు. వందలాది మంది కామెంట్స్ చేశారు. ఇక చాలా మంది నెటిజన్లు ఈ జంట నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే భారత్ లో అలవాటుపడేందుకు సమయం పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరో వ్యక్తి కామెంట్ చేస్తూ.. మా వదిన అమెరికాలో వైద్యురాలిగా ఉన్నప్పటికీ ఆమెకు అపెండెక్స్ సమస్య వచ్చినప్పుడు సర్జరీకి 45 వేల డాలర్లు ఖర్చయింది. అదే భారత్ లో అయితే రూ. 30 వేలకే సర్జరీ అవుతుంది.. అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+