Road Accident: మద్యం సీసాల రాలీ బోల్తా.. తర్వాత ఏం జరిగిందో మీరే చెబుతారు..
మద్యం లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురై మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. కేరళ కోజికోడ్‌లోని ఫరూక్ వంతెన వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జి మీదుగా వెళ్తున్న లారీలో కొంత భాగం బ్రిడ్జిని ఢీకొట్టడంతో మద్యం సీసాలు కింద పడ్డాయి. టార్పాలిన్‌తో కట్టిన సీసాలు కింద పడ్డాయి. దీంతో స్థానికులు పరుగులు తీసి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు.
90 కిలోమీటర్ల దూరం
ఒక్కరు సీసా సీసాలు పట్టుకెళ్లారు. ఇందుక సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోజికోడ్ నుంచి వస్తున్న లారీ నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో మద్యం సీసాలు కింద పడిపోయాయి.

కొల్లాం
అక్కడున్న స్థానికులు బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లగా మిగిలిన బాటిళ్లను పోలీసులు సేకరించి స్టేషన్ కు తరలించారు. మహారాష్ట్రలోని ఓ మద్యం ఫ్యాక్టరీ నుంచి కొల్లాంలోని గోదాముకు తీసుకెళ్తున్న మద్యం సీసాలను లారీలో తరలిస్తున్నారు. లారీని హర్యానా రిజిస్ట్రేషన్‌తో పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications